ఆంధ్రప్రదేశ్

మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు అరెస్ట్?

  • దుర్గాప్రసాద్ హత్య కేసులో నిందితుడిగా విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్
  • మధురైలో శ్రీకాంత్ ను అరెస్ట్ చేసినట్టు సమాచారం
  • ట్రాన్సిట్ వారెంట్ పై ఏపీకి తీసుకొస్తున్న పోలీసులు

వైసీపీ నేత, మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. దళిత యువకుడు, వాలంటీర్ జనుపల్లి దుర్గాప్రసాద్ హత్య కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. తమిళనాడులోని మధురైలో శ్రీకాంత్ ను అరెస్ట్ చేసి, అక్కడి న్యాయమూర్తి ముందు హాజరుపరిచినట్టు సమాచారం. ట్రాన్సిట్ వారెంట్ పై ఆయనను ఏపీకి తీసుకొస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. కోనసీమ జిల్లాలోని కొత్తపేట డీఎస్పీ ముందు హాజరుపరిచి, శ్రీకాంత్ ను విచారించనున్నారు. అనంతరం ఆయనను రిమాండ్ కు తరలిస్తారు.

కేసు వివరాల్లోకి వెళితే… కోనసీమ జిల్లా అయినవిల్లిలో రెండేళ్ల క్రితం దుర్గాప్రసాద్ హత్య జరిగింది. కోనసీమ అల్లర్ల సమయంలో 2022 జూన్ 6న దుర్గాప్రసాద్ ను హత్య చేశారు. ఈ కేసులో శ్రీకాంత్ ను ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించినట్టు సమాచారం. ఈ హత్య కేసులో వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వడ్డి ధర్మేశ్ ను గత నెల 18న అరెస్ట్ చేసిన పోలీసులు… రిమాండ్ కు తరలించారు. తాజాగా శ్రీకాంత్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. మరో నలుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Related posts

ఖమ్మం జిల్లాలో 35వేల దొంగఓట్లు..కేంద్ర ఎన్నికల సంఘానికి తుమ్మల ఫిర్యాదు…

Ram Narayana

Three BRS candidates elected unopposed to Telangana Council

Drukpadam

బాణసంచా ప్రమాదంలో ఎనిమిదికి పెరిగిన మృతుల సంఖ్య… రూ.15 లక్షల చొప్పున పరిహారం!

Ram Narayana