Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

గ్రూప్ వన్ పరీక్షలు ముందుకు వెళ్ళేవి కావు …ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అనుమానం …

జి ఓ నెంబర్ 29 బీసీలకు అన్యాయమని దాన్ని రద్దు చేయకుండా పరీక్షలు జరిపితే అవి ముందుకు వెళ్లావని ఎక్కడ ప్రారంభం అయిందో అక్కడికే వస్తాయని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు … సోమవారం రాజ్ భవన్ లో బీసీ సంఘం ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో అన్ని పార్టీల్లోని అన్ని బీసీ సంఘాల నాయకులు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ను కలిశారు.అనంతరం మీడియాతో మాట్లాడిన తీన్మార్ మల్లన్న.. జీవో 29 వద్దని చెబుతున్నా అదే జీవో ప్రకారం ఇవాళ ప్రభుత్వం గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తోందని నా అంచనా ప్రకారం గ్రూప్ -1 పరీక్షలు ముందుకు వెళ్లే పరీక్షలేమి కావని అటు ఇటు ఊగి చివరకు ఎక్కడి నుంచి ప్రారంభమైందో అక్కడికే వచ్చి చేరుకునేలా కనిపిస్తోందని అన్నారు. తెలంగాణలో బీసీలకు జరుగుతున్న అన్యాయం, ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దక్కాల్సిన కోటాను పట్టపగలే అగ్రవర్గాలకు అప్పజెప్పుతున్న విధానంపై గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. గతంలోనే ఈ సమస్యను గవర్నర్ కు వివరించినా ఇవాళ మరోసారి కలిసి గవర్నర్ కు వినతిపత్రం అందజేశామని చెప్పారు. పదే పదే పరీక్షలు వాయిదా పడటం వల్ల అభ్యర్థుల మనోధైర్యం దెబ్బతినేలా ఉందని అందువల్ల కోర్టు కేసుల పరిష్కారం తర్వాతే పరీక్షలు నిర్వహించే విషయాన్ని గవర్నర్ కు నివేదించామన్నారు. కేవలం 3 శాతం ఉన్న అగ్రవర్ణాల ప్రజల కోసం 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని ఇది రాజ్యాంగ విరుద్ధం అన్నారు. ఇది బీసీల కంచంలో నుంచి కూడు లాక్కోవడమే అన్నారు. ఈ విషయంలోతాను ఇప్పటి వరకు సీఎంకు మూడు సార్లు, గవర్నర్ కు రెండు సార్లు వినతిపత్రం ఇచ్చానన్నారు. ఇంకా అవకాశం ఉన్నప్రతిచోటా రిప్రజెంటేషన్లు ఇస్తామన్నారు. అయితే మా ఆవేదనను పరిగణలోకి తీసుకోకుండా ఇలాగే మొండిగా ముందుకు వెళ్తామంటే ఇది మీ అందరి రాజకీయ సమాధికి నాంధి పలుకుకుందని హెచ్చరించారు. ఇప్పటికే బీసీలమంతా ఏకమయ్యామని, మా నాయకుడు రాహుల్ గాంధీ ఆశయాలను తెలంగాణలో నెరవేర్చబోతున్నామన్నారు. ఈ ఆశయాలకు విరుద్ధంగా ప్రభుత్వం పని చేసినా లేక ప్రభుత్వంలోని ఎవరూ పని చేస్తే మేమంతా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రాహుల్ గాంధీ తలదించుకునే పనులు ఎవరు చేసినా అంగీకరించబోమన్నారు. ఓ వైపు రాహుల్ గాంధీనే జనాభా దామాషా రిజర్వేషన్లు ఉండాలని చెబుతుంటే ఇక్కడ అలా జరగడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోమన్నారు. గవర్నర్ చర్యలు తీసుకుంటామని నమ్ముతున్నామని చెప్పారు.

Related posts

ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు సీట్లు కేటాయించాలని వ్యక్తి నిరసన

Ram Narayana

మేడిగడ్డ మరమ్మతులకు ప్రభుత్వం రెడీ.. సముద్రం పాలవుతున్న సాగునీరు

Ram Narayana

తెలంగాణ పల్లెల్లో ఇక ఇంటర్నెట్ విప్లవం.. రూ. 300తో కంప్యూటర్‌గా మారిపోనున్న టీవీ!

Ram Narayana

Leave a Comment