Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

నీకోదండం.. నీ పార్టీకో దండం అంటూ ప్రభుత్వ విప్ అడ్లూరిపై జీవన రెడ్డి ఫైర్

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి హత్యపై ఆగ్రహోదగ్రుడైయ్యాడు …పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మారు గంగారెడ్డిని మంగళవారం ఉదయం హత్య చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆందోళన చేసిన జీవన్ రెడ్డి ఈ సందర్భంగా సొంత ప్రభుత్వంపైనే హాట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ తో మాట్లాడుతూ.. ‘నీకోదండం.. నీ పార్టీకో దండం. కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని చంపేసింది. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో అవమానాలు భరిస్తున్నా’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా జగిత్యాలలో మాత్రం బీఆర్ యస్ ప్రభుత్వమే నడుస్తుందని ఫైర్ అయ్యారు..

జగిత్యాల జిల్లా రూరల్ మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి సోమవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు.
ఆయన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ప్రధాన అనుచరుడు. బీఆర్ యస్ కు చెందిన సంతోశ్ అనే వ్యక్తి మొదట గంగారెడ్డిని కారుతో ఢీకొట్టాడు.. ఆ తర్వాత కత్తితో పొడిచినట్లు స్థానికులు తెలిపారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ గంగారెడ్డిని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణిం చినట్లు వెల్లడించారు. ఇక, గ్రామంలో రాజకీయ కక్షలే హత్యకి ప్రధాన కారణమని తెలుస్తుంది..దీంతో జగిత్యాల- ధర్మపురి ప్రధాన రహదారిపై బైఠాయించిన జీవన్ రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లా డుతూ.. తమ్మునిలాంటి వాడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాలలో బీఆర్ఎస్ రాజ్యం నడుస్తుందా.. లేదంటే కాంగ్రెస్ రాజ్యం నడుస్తుందాని అని ప్రశ్నిం చారు. కాంగ్రెస్ రాజ్యంలో కాంగ్రెస్ నాయకులకే రక్షణ కరువైందని మండిపడ్డారు. తన ఇక రాజకీయాలకు స్వస్తి చెప్పి స్వచ్చంద సంస్థను పెట్టుకొని ప్రజాసేవసేస్తానని అన్నారు ..జీవన్ రెడ్డి రస్తా రోకోలో స్వయంగా కూర్చోవడంతో పోలీసులు నిందితున్ని పట్టుకొని చట్ట ప్రకారంశిక్షిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు …

కాంగ్రెస్ లో ఉండలేను: ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

I can not stay in Congress says Jeevan Reddy

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు గంగారెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యను నిరసిస్తూ జీవన్ రెడ్డి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సొంత ప్రభుత్వంపైనే ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలకే భరోసా లేదని ఆయన అన్నారు. తాను ఎవరికీ భరోసా ఇచ్చే స్థితిలో లేనని చెప్పారు. 

“నీకో దండం… నీ పార్టీకో దండం” అంటూ విప్ అడ్లూరి లక్ష్మణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జీవన్ రెడ్డికి పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఫోన్ చేయగా… తాను కాంగ్రెస్ పార్టీలో ఉండలేనని, పార్టీ కోసం తన నాలుగు దశాబ్దాల కష్టానికి మంచి బహుమతి ఇచ్చారంటూ ఫోన్ కట్ చేశారు. 

Related posts

తెలంగాణ శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా మజ్లిస్ పార్టీ నేత అక్బరుద్దీన్ ఒవైసీ

Ram Narayana

నేను పదవుల రేసులో లేను… ముఖ్యమంత్రి పదవి నా వద్దకు వస్తుంది!: జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Narayana

పొంగులేటి షాక్ ….ముఖ్య అనుచరుడు డాక్టర్ తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ కు గుడ్ బై …

Ram Narayana

Leave a Comment