వర్ల రామయ్యను రాజ్యసభ వరించే అవకాశం …!
మరో రెండు స్థానాల్లో కూటమి ఎవరిని నిర్ణయిస్తుంది
నాగబాబుకు కూటమి అవకాశం ఇస్తుందా …?
బీజేపీ ఒక సీటు అడిగే అవకాశం …
పాతవారినే తిరిగి కూటమి సర్కార్ రాజ్యసభకు పంపుతుందా …
రాజ్యసభలో ప్రస్తుతం ఒక్కసీటు కూడా లేని టీడీపీ డిసెంబర్ లో జరగనున్న ఉపఎన్నికల్లో తిరిగి తమ ఖాతా తెరవనున్నది …ఏపీలో వైసీపీ నుంచి ఎన్నికైన మోపిదేవి వెంకటరమణ ,బీద మస్తాన్ రావు ,ఆర్ .కృష్ణయ్య లో జగన్ ప్రభుత్వం ఓటమి అనంతరం రాజీనామా చేశారు …దీంతో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి…వాటికీ డిసెంబర్ 20 న ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల సంఘం షడ్యూల్ ప్రకటించింది …దీంతో రాజ్యసభకు కూటమి ప్రభుత్వం ఎవరిని ఎంపిక చేస్తుందనేది ఆసక్తిగా మారింది …తిరిగి రాజీనామా చేసిన వారిలో ఇద్దరు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు …ఆర్ .కృష్ణయ్య తెలంగాణ బీసీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు …అయితే తిరిగి తమ పార్టీలో చేరిన ఇద్దరినే టీడీపీ రాజ్యసభకు పంపిస్తుందా ..? లేక కొత్తవారికి పార్టీలో ఉన్న సీనియర్స్ కు అవకాశం ఇస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది ..ఒక లెక్క ప్రకారం గతంలో తమకు ఏమాత్రం బలం లేకపోయినా చంద్రబాబు ఆదేశాల మేరకు పోటీచేసి ఓడిపోయినా పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య కు సీటు ఇస్తుందా …? అనే చర్చ కూడా జరుగుతుంది …రాజీనామా చేసిన వారికి అవకాశం లేకపోతె ఎస్సీ సామజిక వర్గానికి చెందిన వర్ల రామయ్య రాజ్యసభకు పోవడం ఖాయంగానే కనిపిస్తుంది ..అయితే జనసేన కూడా సీటు అడిగే అవకాశం ఉంది..ఆపార్టీకి చెందిన పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబుకు అవకాశం రావచ్చునని తెలుస్తుంది …మూడు సీటు బీజేపీ అడిగే అవకాశం ఉంది …ఆపార్టీకి సీటు కేటాయిస్తే ఎవరిని వారు ఎంపిక చేస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగవచ్చు …వన్ నేషన్ వన్ ఎలక్షన్ బీజేపీ విధానంగా ఉన్నందున రాష్ట్రాలతో పాటు రాజ్యసభలో తగిన బలం కోసం చూస్తున్న బీజేపీ తమవారికి అవకాశం ఇవ్వమని ఏపీ కూటమిని ప్రత్యేకించి సీఎం చంద్రబాబును కొరవవచ్చు …పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ ప్రతిపాదనను ఆమోదించే అవకాశం ఉంది ..అందువల్ల మూడు రాజ్యసభ సీట్లపై నామినేషన్స్ వరకు సస్పెన్షన్ కొనసాగుతుందా ఈ లోపే దానికి కూటమి తెరదించుతారా అనేది చూడాల్సిందే ….!