Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

ఏక్ నాథ్ షిండే సంతోషంగా లేరు: కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే

  • ఫడ్నవిస్ ను సీఎం చేసే యోచనలో బీజేపీ అధిష్ఠానం ఉందన్న అథవాలే
  • షిండే అసంతృప్తిని తొలగించాల్సి ఉందని వ్యాఖ్య
  • షిండే డిప్యూటీ సీఎం లేదా కేంద్ర మంత్రి కావచ్చన్న అథవాలే

మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫడ్నవిస్ ను సీఎం చేయాలనే యోచనలో బీజేపీ అధిష్ఠానం ఉందని ఆయన తెలిపారు. ఈ విషయంలో ఏక్ నాథ్ షిండే సంతోషంగా లేరని… ఆయన అసంతృప్తిని తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ వివాదానికి త్వరలోనే తెరపడుతుందని అన్నారు.  

ఫడ్నవిస్ నాయకత్వంలో పనిచేసే విషయంపై షిండే ఆలోచించాలని రాందాస్ అథవాలే సూచించారు. షిండే ఉప ముఖ్యమంత్రి కావచ్చని లేదా కేంద్ర మంత్రి కూడా కావచ్చని చెప్పారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ విషయంపై ఆలోచించి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు. మహారాష్ట్ర కేబినెట్ లో తమ పార్టీకి కూడా ఒక మంత్రి పదవి ఇవ్వాలని… తమ పార్టీ డిమాండ్ ను ఫడ్నవిస్ ముందు కూడా ఉంచానని చెప్పారు.

Related posts

కేంద్రంలో మూడోసారీ మోదీనే.. యూకే పత్రికలో కథనం

Ram Narayana

మోదీ పాలనలో రైలు ప్రయాణం నరకంగా మారింది: రాహుల్ గాంధీ

Ram Narayana

కులగణన చేస్తాం… పేదల లిస్ట్ తీసి ఒక్కో మహిళ ఖాతాలో రూ.1 లక్ష జమ చేస్తాం: రాహుల్ గాంధీ

Ram Narayana

Leave a Comment