Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోర్ట్ తీర్పులు

హీరో ధనుష్, ఐశ్వర్యకు విడాకుల మంజూరు!

  • ధనుష్, ఐశ్వర్యలకు విడాకులు మంజూరు చేసిన చెన్నైలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టు
  • రెండేళ్ల క్రితమే విడిపోతున్నట్లుగా ప్రకటించిన ధనుష్, ఐశ్వర్య
  • ఈ ఏడాది ప్రారంభంలో విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన ధనుష్, ఐశ్వర్య

హీరో ధనుష్ – ఐశ్వర్యా రజనీకాంత్ ఇప్పుడు చట్టపరంగా విడిపోయారు. రెండేళ్ల క్రితమే వీరు తమ 18 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలికి నైతికంగా విడిపోయారు. తాము విడిపోవాలని నిర్ణయించుకున్నామని వీరిద్దరూ రెండేళ్ల క్రితమే ప్రకటించారు. అయితే చట్టపరంగా విడిపోయేందుకు గానూ పరస్పర అంగీకారంతో ఈ ఏడాది ఆరంభంలో విడాకుల కోసం చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. 

పలుమార్లు ఈ కేసు విచారణకు రాగా ఇద్దరూ కోర్టు వాయిదాలకు హాజరు కాలేదు. కొన్ని రోజుల క్రితం వేర్వేరుగా వీరు ఇద్దరూ కోర్టుకు వెళ్లి, కొన్నేళ్లుగా తామిద్దరం విడిపోయి ఉంటున్నామని, విడాకులు తీసుకోవడానికి దృఢ నిశ్చయంతో ఉన్నామని తెలిపారు. కలిసి ఉండాలని అనుకోవడం లేదని తమ నిర్ణయాన్ని స్పష్టం చేస్తూ విడిపోవడానికి గల కారణాలు వివరించారు. ఇరువురి వాదనలు విన్న చెన్నైలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టు తాజాగా విడాకులు మంజూరు చేసింది. దీంతో వీరు చట్టపరంగానూ విడిపోయినట్లు అయింది. 

ఐశ్వర్య .. సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె. హీరో ధనుష్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో 2004లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. దాదాపు 15ఏళ్లకు పైగా వీరి వైవాహిక జీవితం సాఫీగానే సాగింది. అయితే రెండేళ్ల క్రితం తాము విడిపోవాలని నిర్ణయించుకున్నామని ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా న్యాయస్థానాన్ని ఆశ్రయించి చట్టపరంగా విడాకులు తీసుకున్నారు.   

Related posts

స్వాతి మలివాల్ పై దాడి కేసు..ఢిల్లీ సీఎం సహాయకుడికి 5 రోజుల కస్టడీ…

Ram Narayana

డాక్టర్ పై హత్యాచారం కేసు సీబీఐకి అప్పగించిన కలకత్తా హైకోర్టు!

Ram Narayana

చంద్రబాబుకు భారీ ఊరట.. అంగళ్లు కేసులో ముందస్తు బెయిల్ మంజూరు

Ram Narayana

Leave a Comment