జాతీయ వార్తలు

చెన్నైలో ముగ్గురిని బలిగొన్న ఫెంగల్ తుపాను.. 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షాలు

  • తమిళనాడు, పుదుచ్చేరిలో తుపాను బీభత్సం
  • గత మూడు దశాబ్దాల్లో తొలిసారి 44 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
  • 16 గంటల తర్వాత తెరుచుకున్న చెన్నై విమానాశ్రయం
  • అయినా పలు విమానాలు రద్దు, ఆలస్యం
  • జన జీవనం అస్తవ్యస్తం.. ప్రజా రవాణాకు ఆటంకం
  • ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల్లో స్థిరంగా తుపాను

తమిళనాడులో బీభత్సం సృష్టించిన ఫెంగల్ (ఫెయింజల్) తుపాను చెన్నైలో ముగ్గురి ప్రాణాలను బలిగొంది. తుపాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాల్లో గత సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై వ్యాప్తంగా కుండపోత కురుస్తోంది. అయితే, భారీ నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేకున్నా తమిళనాడు, పుదుచ్చేరిలలో గత మూడు దశాబ్దాల్లోనే అత్యధిక వర్షపాతం (44 సెంటీమీటర్లు) నమోదైంది. 

తుపాను కారణంగా చెన్నై విమానాశ్రయం 16 గంటలపాటు మూతబడింది. ఈ ఉదయం 4 గంటలకు తెరుచుకున్నా చాలా వరకు విమానాలు రద్దు కాగా, మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. చెన్నై, పుదుచ్చేరి సహా పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వానల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రజా రవాణా స్తంభించింది. బస్సులు, రైళ్ల ప్రయాణాలకు ఆటంకం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల్లో స్థిరంగా ఉన్న తుపాను క్రమంగా అల్పపీడనంగా బలహీనపడుతుందని భారత వాతావరణశాఖ తెలిపింది. 

Related posts

గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుని గోవాకు.. అడవిలోకి వెళ్లిపోయిన కుటుంబం..

Ram Narayana

ఇన్‌స్టా రీల్ కోసం ఫ్లైఓవర్‌పై కారును ఆపిన వ్యక్తి.. రూ.36,000 జరిమానా విధించిన పోలీసులు

Ram Narayana

ట్రంప్ టారీఫ్ ల వెనక అసలు ఉద్దేశం వేరే అంటున్న ఆర్బీఐ మాజీ గవర్నర్…

Ram Narayana