Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

ప్రతి ఏడాది డిసెంబర్ 9 న తెలంగాణ తల్లి వేడుకలు …సీఎం రేవంత్ రెడ్డి

ప్రతీ ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ వేడుకలు ప్రభుత్వ పరంగా నిర్వహిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు రాజకీయాలకు అతీతంగా పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
భవిష్యత్ లో ఈ కార్యక్రమాన్ని మార్చినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు రేవంత్. సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో పాల్గొన్న రేవంత్.. మన సంస్కృతి, సంప్రదాయాలకు తెలంగాణ తల్లి ప్రతిరూపమన్నారు.

మీ అందరినీ చూస్తోంటే కృష్ణా, గోదావరి నదులు ఇక్కడ ప్రవహిస్తున్నట్లు ఉంది..చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయే ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. భూలోకంలో ఏ ప్రాంతానికైనా, ఎవరికైనా గుర్తింపు తల్లితోనే
చిన్నప్పుడు నా తల్లి ఎలా ఉందో..ఇపుడు తెలంగాణ తల్లి అలానే ఉంది.. మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపం తల్లి ..ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతిపై దాడి చేయడమే కాదు… అవమానించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత ఒక వ్యక్తి, ఒక రాజకీయ పార్టీ తమ గురించి మాత్రమే ఆలోచించి… తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పక్కనపెట్టారు ..ప్రజా ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని మా సహచర మంత్రులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నా..తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా గత పాలకులు వాహనాలకు టీజీ బదులు టీఎస్ అని నిర్ణయించారు. అందుకే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే టీజీని అధికారికంగా వాహనాలకు ఏర్పాటు చేసేలా అమలులోకి తీసుకొచ్చాం…

ఉద్యమ సమయంలో స్ఫూర్తిని నింపిన జయ జయహే తెలంగాణ గీతాన్ని పదేళ్లుగా రాష్ట్ర గీతంగా ఎందుకు ప్రకటించలేదు.ప్రజా ప్రభుత్వంలో జయజయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించుకున్నాం.. రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ లాంటి సచివాలయంలో కవి అందెశ్రీని సన్మానించుకోవడం నాకు జీవితకాలం గుర్తుండే సందర్భం.

ఉద్యమ కాలంలో పలు రాజకీయ పార్టీలు తెలంగాణా తల్లికి వివిధ రూపాలు ఇచ్చారు.
కానీ ఇప్పటివరకు తెలంగాణ తల్లి రూపాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అందుకే ప్రజా ప్రభుత్వం బహుజనుల తల్లి రూపమే తెలంగాణ తల్లి రూపంగా అధికారికంగా ప్రకటించింది.

తెలంగాణ తల్లిని చూస్తే కన్నతల్లి ప్రతిరూపంగా స్పురిస్తోంది.
డిసెంబర్ 9 ఒక పవిత్రమైన రోజు.. ఒక పండుగ రోజు..
ఈ రోజు మన ఆలోచనలన్నీ అమ్మ చుట్టూనే ఉండాలని ఒక పండుగలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం.

సంక్షోభం నుంచి సంక్షేమం వైపు, అవినీతి నుంచి అభివృద్ధి వైపు, తెలంగాణను పునర్నిర్మాణం వైపు తీసుకెళుతున్నాం.

తెలంగాణ కోసం సర్వం కోల్పోయిన కవులను గుర్తించాలని, గౌరవించాలని ఆదుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేసింది.
గూడ అంజయ్య, గద్దర్, బండి యాదగిరి, అందెశ్రీ, గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, జయరాజు, పాశం యాదగిరి, ఎక్కా యాదగిరి రావులను ప్రభుత్వం గుర్తిస్తోంది.. ఫ్యూచర్ సిటీలో ఈ తొమ్మిది మంది కవులకు 300 గజాల ఇంటిస్థలంతోపాటు, రూ.కోటి నగదు, తామ్రపత్రం అందిస్తాం

కొంతమందికి బాధ, ఆవేదన, దుఃఖం ఉండొచ్చు.
వాళ్ల రాజకీయ మనుగడకు ఈ నిర్ణయాలు ప్రమాదకరమని వాళ్లు అనుకోవచ్చు..
కానీ ఒక కుటుంబం కోసమో, ఒక రాజకీయ పార్టీ కోసమో మనం తెలంగాణ సాధించుకోలేదు..

ఉమ్మడి రాష్ట్రంలో అవమానాలు ఎదుర్కొన్నాం.. తెలంగాణలో పదేళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాం..
ఇక అలాంటి అవమానాలు, నిర్లక్ష్యాలు ఉండకూడదని ప్రతీ ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ వేడుకలు ప్రభుత్వ పరంగా నిర్వహిస్తాం..

Related posts

నా రెండు దరఖాస్తులు చెత్త బుట్టలోకి వెళ్లాయేమో మాజీ డీఎస్పీ నళిని…

Ram Narayana

క్షమించండి… మీ అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరుకాలేను: సీపీఐ నారాయణ!

Ram Narayana

10 లక్షల బోగస్ ఓట్లు.. అందులో సగం హైదరాబాద్ లోనే

Ram Narayana

Leave a Comment