తెలంగాణ వార్తలు

వారు పడుతున్న ఇబ్బందిని రేవంత్ రెడ్డి, నేను గమనిస్తున్నాం: భట్టి విక్రమార్క

  • సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీల బిల్లులను విడుదల చేయాలనుకుంటున్నామని వెల్లడి
  • పెండింగ్ నిధులపై బీఆర్ఎస్ నేతలు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని వ్యాఖ్య
  • రూ.10 లక్షల లోపు ఉన్న వాటిని తొలుత విడుదల చేయాలనుకుంటున్నట్లు వెల్లడి

సర్పంచ్‌లు (మాజీ), స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పడుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను గమనిస్తున్నామని, అందుకే నిధులను విడుదల చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ… సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల (మాజీ) పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని భావిస్తున్నామన్నారు.

అయితే ఈ నిధుల విషయంలో బీఆర్ఎస్ నేతలు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు దాదాపు రూ.1,300 కోట్ల వరకు ఉన్నాయన్నారు. ఇందులో రూ.10 లక్షల లోపు బకాయిల విలువ దాదాపు రూ.400 కోట్లుగా ఉందన్నారు. తొలుత ఈ బిల్లులను విడుదల చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం వారి బిల్లులను పెండింగ్‌లో పెట్టిందని ఆరోపించారు.

Related posts

ఎన్నికల స్టంట్ అనుకోండి!: ఆర్టీసీ విలీనంపై మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Narayana

గద్దర్ పార్థివదేహానికి కేసీఆర్ నివాళులు.. గద్దర్ భార్యకు సోనియా గాంధీ సంతాప లేఖ

Ram Narayana

నేటి నుంచి దక్షిణకొరియాలో తెలంగాణ మంత్రుల పర్యటన…

Ram Narayana