కోర్ట్ వార్తలు ...

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు!

  • 2023లో వీరసావర్కర్‌ను ఉద్దేశించి లండన్‌లో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు
  • పరువు నష్టం కేసు వేసిన సావర్కర్ మనవడు సత్యకి సావర్కర్
  • రూ.25 వేల పూచీకత్తు బాండ్‌పై రాహుల్ గాంధీకి బెయిల్

పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి పుణే కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 2023 మార్చిలో లండన్‌లో వీరసావర్కర్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యల మీద సావర్కర్ మనవడు సత్యకి సావర్కర్ పుణేలోని కోర్టులో పరువు నష్టం కేసు వేశారు.

ఈ కేసుకు సంబంధించి ఈరోజు రాహుల్ గాంధీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఆయనకు రూ.25 వేల పూచీకత్తు బాండ్‌పై ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాహుల్ గాంధీకి పూచీకత్తుగా కాంగ్రెస్ సీనియర్ నేత మోహన్ కోర్టుకు హాజరయ్యారు.

Related posts

కోర్టులో బియ్యం చల్లిన డాక్టర్.. చేతబడి అనుమానంతో ఆగిన విచారణ!

Ram Narayana

9 ఏళ్ల సహజీవనం తర్వాత పెళ్లికి నో.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు…

Ram Narayana

కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు ఆదేశాలు..

Ram Narayana