- ఈ నెల 27న తెలంగాణ పర్యటనకు వస్తున్న రాహుల్, ఖర్గే
- ‘సంవిధాన్ బచావో’ కార్యక్రమంలో పాల్గొననున్న కాంగ్రెస్ అగ్ర నేతలు
- రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందంటూ కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 27న తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా ప్రకటించింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా తెలంగాణలో నిర్వహించనున్న ‘సంవిధాన్ బచావో’ కార్యక్రమంలో వీరు పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ లేఖ రాశారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పోరాడుతుందని లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం విస్తృతమైన కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు.