Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

శబరిమలలో మకరజ్యోతి దర్శనం …అయ్యప్ప భక్తజన పరవశం!

శబరిమలలో మకరజ్యోతి దర్శనం …అయ్యప్ప భక్తజన పరవశం!

కేరళ శబరిమల అయ్యప్పస్వామి ఆలయం శరణుఘోషతో మార్మోగింది. తిరువాభరణా ఘట్టం పూర్తయ్యాక పొన్నాంబల మేడులో మకరజ్యోతి రూపంలో అయ్యప్ప భక్తులకు దర్శనమిచ్చారు. దీనితో హరిహర సుతుడైన స్వామి అయ్యప్పను స్మరిస్తూ స్వామియే శరణం అయ్యప్ప అన్న శరణుఘోషలతో శబరిగిరులు ప్రతిధ్వనించాయి. మకరజ్యోతిని వీక్షించేందుకు వచ్చిన అయ్యప్ప స్వాములతో శబరిమల సన్నిధానం కిక్కిరిసిపోయింది.

మకరజ్యోతి విశిష్టత
కాంతమాల కొండలపై దేవతలు, రుషులు కలిసి భగవంతునికి హారతి ఇస్తారని అయ్యప్ప భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ రోజు పందాళం నుంచి తీసుకువచ్చిన తిరువాభరణాలను ప్రధాన అర్చకులు స్వామివారికి అలంకరించారు. అనంతరం మూలమూర్తికి హారతి నిచ్చారు. ఆ వెంటనే క్షణాల్లో చీకట్లను తొలగిస్తూ పొన్నాంబలంమేడు పర్వత శిఖరాల్లో జ్యోతి దర్శనమిచ్చింది. అది చూసి మనసు నిండుగా భక్తిభావంతో తన్మయం చెందిన భక్తులు స్వామియే శరణం అయ్యప్ప అంటూ శరణమిల్లారు. జ్యోతి దర్శనం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Related posts

పిల్లలను తాకట్టు పెట్టి టమాటాలతో పరార్.. ఒడిశాలో నయా మోసం

Ram Narayana

క్యూఆర్‌ కోడ్‌‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన రైల్వే శాఖ

Ram Narayana

బ్యాంక్ ఆఫ్ బరోడాలో స్కాం?.. ఖాతాదారుల్లో టెన్షన్

Ram Narayana

Leave a Comment