Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అసెంబ్లీ ఎన్నికలు

న్యూఢిల్లీ స్థానానికి నామినేషన్‌ దాఖ‌లు చేసిన కేజ్రీవాల్‌.. ప‌నికి ఓటు వేయాల‌ని అభ్య‌ర్థ‌న‌!


ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ వేశారు. రిటర్నింగ్‌ ఆఫీసర్‌కు నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ఆయ‌న‌ కోరారు. 

అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ… “నేను నామినేషన్ దాఖలు చేశాను. దయచేసి పనికి ఓటు వేయమని ఢిల్లీ ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. ఒక వైపు పని చేసే పార్టీ ఉంది. ఇంకోవైపు పని, విద్య, ఆరోగ్యం, కరెంటు, రోడ్లు.. ఇలా ఎన్నో పనులు మిగిలి ఉన్నాయి. ఈ ప‌నుల‌న్నీ చేయాలి. కాబట్టి ప్రజలు కష్టపడి ప‌నిచేసేవారికే ఓటేస్తారని ఆశిస్తున్నాను. అని అన్నారు.

కాగా, వచ్చే నెల 5న మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు సంబంధించి ఈ నెల 10న నోటిఫికేషన్‌ విడుదల కాగా.. 17వ తేదీ వరకు నామినేషన్‌ల దాఖలుకు అవకాశం కల్పించారు. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది.  

Related posts

కాంగ్రెస్ కు 80 సీట్లునా …? .. అయితే ల్యాండ్ స్లయిడ్ విక్టరీనే ….

Ram Narayana

ప్రచార ఖర్చులో తప్పుడు లెక్కలకు చెల్లు.. ధరల పట్టికను విడుదల చేసిన ఈసీ

Ram Narayana

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి చూపూ ఆ ఐదు స్థానాలపైనే..!

Ram Narayana

Leave a Comment