పార్లమెంట్ బడ్జెట్ సెషన్ తేదీలు ఖరారు అయ్యాయి.
జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ జరగనున్నాయి. ఫిబ్రవరి 1న 2025-26 ఆర్థిక సవంత్సరం బడ్జెట్ ను పార్లమెంట్ లో కేంద్రం ప్రవేశపెట్టబోతున్నది. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండో విడత సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 31న పార్లమెంట్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఢిల్లీ ఎన్నికల కారణంగా ఫిబ్రవరి 5న, రవిదాస్ జయంతి నేపథ్యంలో ఫిబ్రవరి 12న సెలవు ఉండనున్నది.
ఈ మేరకు పార్లమెంట్ సెక్రటేరియట్ ప్రకటన విడుదల చేసింది …