Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సినిమా వార్తలు

సైఫ్ అలీ ఖాన్ కు ప్రస్తుతం సెక్యూరిటీ ఇస్తోంది ఎవరో తెలుసా?

  • సైఫ్ సెక్యూరిటీ బాధ్యతలు చేపట్టిన నటుడు రోనిత్ రాయ్
  • ముంబయి వేదికగా సెక్యూరిటీ ఏజన్సీ నిర్వహిస్తున్న రోనిత్ 
  • సైఫ్ ఆరోగ్యం మెరుగుపడిందని వెల్లడి 

ఇటీవల తన ఇంటిలో ఓ దుండగుడు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ పూర్తిగా కోలుకున్నారు. దీంతో లీలావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో సైఫ్ కుటుంబం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ .. సైఫ్ సెక్యూరిటీ బాధ్యతలను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాము ప్రస్తుతం సైఫ్‌తోనే ఉన్నామని చెప్పారు. సైఫ్ ఆరోగ్యం మెరుగుపడిందని తెలిపారు. 

సెక్యూరిటీ బాధ్యతలు తీసుకున్న రోనిత్ రాయ్ విషయానికి వస్తే .. ముంబయి వేదికగా సెక్యూరిటీ ఏజన్సీ నిర్వహిస్తున్న రోనిత్ రాయ్ ..ఆర్మీ, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, అగ్లీ తదితర హిందీ చిత్రాల్లో నటించారు. అలాగే ఎన్టీఆర్ జై లవకుశ, విజయ్ దేవరకొండ లైగర్ సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన రాయ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.  

ఈ నెల 16 తెల్లవారుజామున సైఫ్ నివాసంలోకి చొరబడిన ఓ వ్యక్తి చోరీకి ప్రయత్నించాడు. అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా దుండగుడు సైఫ్‌పై కత్తితో దాడి చేయడంతో ఆరు చోట్ల గాయాలయ్యాయి. వెన్నెముకకు తీవ్రగాయం కావడంతో సైఫ్‌కు ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేశారు. వారం రోజుల పాటు విశ్రాంతి అనంతరం వైద్యులు ఆయనను డిశ్చార్జ్ చేశారు. అయితే ఇన్‌ఫెక్షన్ చేరకుండా ఉండేందుకు కొంతకాలం బయట వ్యక్తులకు దూరంగా ఉండాలని సైఫ్‌కు వైద్యులు సూచించారు. 

Related posts

సిమిమా రాజకీయాలు …”వ్యూహం “పై టీడీపీ అభ్యతరం …

Ram Narayana

పార్వతి అమ్మాళ్ కు రూ.10 లక్షలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేసిన హీరో సూర్య!

Drukpadam

తిరుపతిలో సినిమా స్టూడియో పెడతా: జగన్ తో భేటీ అనంతరం  మంచు విష్ణు

Drukpadam

Leave a Comment