Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

రాహుల్ గాంధీకి అస్వస్థత…

  • నేడు ఢిల్లీ ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్న రాహుల్
  • వైద్యుల సూచన మేరకు ప్రచారాన్ని రద్దు చేసుకున్నారన్న ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్
  • రేపు ఎన్నికల ర్యాలీలో పాల్గొంటారని వెల్లడి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్య కారణాలతో ఆయన నేడు ఢిల్లీ ఎన్నికల ప్రచారాన్ని కూడా రద్దు చేసుకున్నారు. ఢిల్లీలోని ముస్తఫాబాద్ లో రాహుల్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాల్సి ఉంది. అయితే వైద్యుల సూచనల మేరకు రాహుల్ ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ తెలిపారు. 

రేపు షెడ్యూల్ ప్రకారం మాదిపూర్ లో ఎన్నికల ర్యాలీ జరుగుతుందని చెప్పారు. భారీ బహిరంగసభలో ఆయన ప్రసంగించే అవకాశం ఉందని తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని… ఒంటరిగానే పోటీ చేస్తున్నామని చెప్పారు. రిపబ్లిక్ డే తర్వాత రాహుల్, ప్రియాంక సహా ఇతర నేతలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తారని తెలిపారు. 

Related posts

బీహెచ్ఈఎల్ లో భారీగా కొలువులు…

Ram Narayana

సెకన్ల వ్యవధిలో దూసుకొచ్చిన కుర్తాళం జలపాతం… బాలుడి గల్లంతు

Ram Narayana

అత్యంత శక్తిమంతమైన పాస్ పోర్ట్ ల జాబితాలో ఇండియా స్థానం ఎంత?

Drukpadam

Leave a Comment