Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

ఫలించిన ఎంపీ రఘురాం రెడ్డి కృషి…కొత్తగూడెంలో విమానాశ్రయానికి ఓకే..

ఫలించిన ఎంపీ రఘురాం రెడ్డి కృషి
కొత్తగూడెంలో విమానాశ్రయానికి ఓకే..

  • సానుకూలంగా స్పందించిన ఎయిర్ పోర్ట్ ప్రత్యేక నిపుణుల బృందం

పారిశ్రామిక ప్రాంతమైన కొత్తగూడెంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని.. తొలి నుంచీ ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి.. విశేష కృషి చేయగా అది సాకారం కాబోతోంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ ) ఉన్నతాధికారుల ప్రత్యేక పర్యవేక్షణ బృందం సర్వే అనంతరం.. ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటుకు అంతా అనుకూలంగా ఉందని ప్రకటించారు.

ఎంపీ విశేష కృషి..
గతేడాది జూలైలోనే లోక్ సభ లో 377 నిబంధన కింద ఈ అంశాన్ని లేవనెత్తారు. దీనికి కేంద్ర విమానయాన శాఖ మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ.. సానుకూలంగా లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఎంపీల బృందంతో కేంద్ర మంత్రిని కలిశారు. ఇక్కడ సర్వే జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.36 లక్షలు కేటాయింపజేశారు.

ఏఏఐ అధికారులు, కలెక్టర్ తో కలిసి భూములు పరిశీలించిన ఎంపీ
విమానాశ్రయం ఏర్పాటు కోసం కేటాయించనున్న సుజాతనగర్, చుంచుపల్లి, కొత్తగూడెం మండలాల్లోని భూములను ఖమ్మం ఎంపీ రామసహాయ రఘురాంరెడ్డి.. కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఏఏఐ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. 950 ఎకరాల భూమి అందుబాటులో ఉందని, ఎలాంటి అభ్యంతరాలు లేకుండా పూర్తి సహకారం అందిస్తామని ఎంపీ సూచించారు. ప్రగతిశీల, పారిశ్రామిక అభివృద్ధికి మేలు చేసే ప్రాజెక్టుగా నిలిచి, ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందని అన్నారు.

కలెక్టరేట్ లో సమీక్ష..
పవర్ పాయింట్ ప్రజెంటేషన్
సర్వే అనంతరం.. కొత్తగూడెంలోని కలెక్టరేట్ లో ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, కలెక్టర్ జితేష్ వి పాటి ల్, స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజెంటేషన్ ద్వారా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యాటక ప్రాంతాల గురించి వివరించారు. సింగరేణి, కేటీపీఎస్, స్పాంజ్ ఐరన్, హెవీ వాటర్ ప్లాంట్.. తదితర ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు ఉన్నాయని, దక్షిణ అయోధ్య భద్రాచలం పుణ్యక్షేత్రానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారని వివరించారు. ఇక్కడి సానుకూల అంశాలను ఎంపీ రఘురాం రెడ్డి కూడా ప్రత్యేకంగా గుర్తు చేశారు.

ఢిల్లీ నుంచి తుది నివేదిక ఇస్తాo..
కొత్తగూడెంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు.. ఇక్కడి భౌగోళిక పరిస్థితి పూర్తి అనుకూలంగా ఉందని ఎయిర్ పోర్ట్ అథారిటీ ప్రత్యేక సర్వే పర్యవేక్షణ బృందం ప్రకటించింది. గత పది సంవత్సరాల వాతావరణ పరిస్థితులను క్రోడీకరిస్థామన్నారు. ఏ ఏ ఐ ఉన్నతాధికారులు, సాంకేతిక నిపుణులు, తెలంగాణ ఏవియేషన్ కార్పొరేషన్ అధికారులు, ఇక్కడ తాము నిర్వహించిన సర్వే పూర్తి వివరాలను ఢిల్లీ లో కేంద్ర ప్రభుత్వానికి అందజేసి.. వీలైనంత త్వరలో విమానాశ్రయ పనులకు శ్రీకారం చుట్టేలా.. తుది నివేదిక విడుదల చేస్తామని ఎంపీ, కలెక్టర్ కు వివరించారు. అనంతరం ఈ బృందాన్ని ఎంపీ, కలెక్టర్ సన్మానించారు.

ఈ కార్యక్రమంలో..: జిల్లా ఉన్నతాధికారులు, కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్, ఆళ్ల మురళి, యువజన నేత చీకోటి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

20 వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి లక్ష్యంతో ముందుకెళ్తున్నాం: భట్టివిక్రమార్క

Ram Narayana

మల్లు భట్టివిక్రమార్క వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

Ram Narayana

రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం.. సోనియా గాంధీ సందేశం…

Ram Narayana

Leave a Comment