జాతీయ వార్తలు

సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో మరింతమంది ప్రమేయం!

  • ఈ నెల 16న సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి నిందితుడి చొరబాటు
  • దొంగతనాన్ని అడ్డుకునే క్రమంలో నిందితుడి చేతిలో సైఫ్‌కు గాయాలు
  • ఘటనా స్థలం నుంచి సేకరించిన వేలిముద్రలతో సరిపోలిన నిందితుడి ఫింగర్‌ప్రింట్స్
  • ఈ నెల 29 వరకు నిందితుడి కస్టడీ పొడిగింపు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తమవుతుండగా తాజాగా ఇందులో మరింత మంది వ్యక్తుల ప్రమేయం ఉండొచ్చని చెబుతున్నారు. ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న బంగ్లాదేశ్‌కు చెందిన షరీఫుల్ ఇస్లాం అలియాస్ షెహ్‌జాద్ మహమ్మద్ రోహిల్లా అమిన్ ఫకీర్ అలియాస్ విజయ్‌దాస్‌ (30)ను ఈ నెల 19న థానేలో ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఈ నెల 16న సైఫ్ ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు దొంగతనం చేసే ప్రయత్నంలో సైఫ్‌పై కత్తితో దాడిచేసి ఆరు చోట్ల గాయపరిచాడు. ఈ కేసులో సాక్ష్యాలను బలపరిచేందుకు సైఫ్, ఆయన ఇంటి సిబ్బంది ధరించిన దుస్తులు, రక్తనమూనాలను పోలీసులు ఇప్పటికే సేకరించారు. నిందితుడి దుస్తులపై ఉన్న రక్తపు మరకలు సైఫ్‌వేనా అని నిర్ధారించేందుకు వారి దుస్తులు సేకరించారు. కాగా, ఘటన జరిగిన ప్రదేశంలో సేకరించిన వేలిముద్రలు నిందితుడి ఫింగర్ ప్రింట్‌తో సరిపోలినట్టు సమాచారం. కాగా, సైఫ్‌పై దాడికి నిందితుడు ఉపయోగించిన ఆయుధాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడన్న వివరాలు ఇప్పటి వరకు తెలియరాలేదు. కాగా, నిందితుడు విచారణలో సహకరించని కారణంగా కోర్టు అతడికి ఈ నెల 29 వరకు కస్టడీని పొడిగించింది.

Mumbai Police Arrest Woman In Bengal in Saif case
  • నిందితుడు వినియోగించిన సిమ్ కార్డు ఈ మహిళ పేరుతో ఉన్నట్లు గుర్తింపు
  • బెంగాల్‌లోని నదియా జిల్లా చప్రాకు చెందిన మహిళగా గుర్తించిన పోలీసులు
  • భారత్‌లోకి చొరబడినప్పటి నుంచి మహిళతో నిందితుడు టచ్‌లో ఉన్నాడని వెల్లడి

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై అతని ఇంట్లో కత్తితో దాడి జరిగిన కేసులో ముంబై పోలీసులు ఓ మహిళను అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. సైఫ్ అలీఖాన్‌పై దాడికి పాల్పడిన నిందితుడు వినియోగించిన సిమ్ కార్డు ఈ మహిళ పేరుతో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.

నదియా జిల్లా చప్రాకు చెందిన మహిళగా గుర్తించామని పశ్చిమ బెంగాల్ పోలీసులు తెలిపారు. ఈ కేసులోని నిందితుడితో ఈమెకు పరిచయం ఉన్నట్లుగా గుర్తించినట్లు చెప్పారు. బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడని, అప్పటి నుంచి మహిళతో టచ్‌లో ఉంటున్నాడని చెప్పారు. దర్యాఫ్తులో భాగంగా ముంబై నుంచి వచ్చిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారని వెల్లడించారు.

Related posts

 కేసుల విచారణపై మద్రాసు హైకోర్టు జడ్జి జస్టిస్ దేవానంద్ కీలక వ్యాఖ్యలు

Ram Narayana

నేటి నుంచి పవన్ కల్యాణ్ దక్షిణాది రాష్ట్రాల పర్యటన!

Ram Narayana

తాను బతికున్నంతవరకు ఒక్కరి ఉద్యోగం పోనివ్వను ..మమతా బెనర్జీ

Ram Narayana