జాతీయ రాజకీయ వార్తలు

సీపీఎం నూతన సారథిగా ఎం.ఎ. బేబీ ఎన్నిక

సిపిఎం ప్రధాన కార్యదర్శిగా కేరళకు చెందిన ఎం ఏ బేబీని తమిళనాడులోని మదురైలో జరిగిన ఆలిండియా 24 వ మహాసభల్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు …ఐదు రోజులపాటు జరిగిన ఈ మహాసభల్లో 18 మందితో నూతన పోర్ట్ బ్యూరో ను 85 మందితో నూతన కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు …పొలిట్ బ్యూరోలో 8 మందికి కొత్తవారికి చోటు కల్పించడం విశేషం ..

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గతేడాది మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణాంతరం నుంచి ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది. దీంతో పార్టీ సీపీఎం నూతన ప్రధాన కార్యదర్శి ఎన్నిక తప్పనిసరి అయింది. ఈ నేపథ్యంలో కేరళ మాజీ మంత్రి ఎం.ఎ. బేబీని సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఎంపిక అయ్యారు. తమిళనాడులోని మదురైలో నిర్వహిస్తున్న పార్టీ 24వ మహాసభల్లో ఆయన్ను కొత్త సారథిగా పార్టీ ఎన్నుకుంది.

ఇక 85 మందితో ఏర్పడిన కేంద్ర కమిటీలో యువతకు చోటు కల్పించారు …84 మంది పేర్లను ప్రకటించగా మరొకటి ఖాళీ ఉంది … తెలంగాణ నుంచి కార్మికనాయకుడు ఎం సాయిబాబా కు స్థానం లభించింది …తెలంగాణ నుంచి తమ్మినేని వీరభద్రం , జాన్ వెస్లీ , ఎస్ వీరయ్య , టి .జ్యోతి లు ఉన్నారు …

Related posts

ప్రస్తుత పరిస్థితుల్లో కేజ్రీవాల్ భార్య సునీత బెస్ట్ పర్సన్: ఢిల్లీ మంత్రి సౌరబ్ భరద్వాజ్

Ram Narayana

వచ్చే లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Narayana

తెలంగాణలో ఈసారి అత్యధిక స్థానాలు గెలుస్తాం .. తెలుగు ఛానల్‌తో ప్రధాని నరేంద్ర మోదీ

Ram Narayana