Bhadrachalam CI Ramesh
క్రైమ్ వార్తలుఖమ్మం వార్తలు

భద్రాచలం సీఐ రమేష్ అరెస్ట్

  • అవినీతికి పాల్పడినందుకు అరెస్ట్ చేసిన ఏసీబీ అధికార్లు
  • సీఐతో పాటు గన్ మెన్, మరో వ్యక్తి అదుపులోకి

భద్రాచలం పట్టణ పోలీస్ స్టేషన్ పై గురువారం ఏసీబీ అధికార్లు దాడి చేశారు. మట్టి అక్రమ రవాణా కేసులో ఆవితీకి పాల్పడినందుకు సీఐ బరపాటి రమేశ్ తో పాటు గన్ మెన్ రామారావు, మరో వ్యక్తి కార్తీక్ ను అరెస్టు చేశారు. ఏసీబీ అధికార్ల కథనం ప్రకారం, మార్చి 19 న లక్ష్మిపురం నుండి భద్రాచలానికి లారీలో మట్టిని తరలిస్తుండగా భద్రాచలం పట్టణ పోలీసులు పట్టుకున్నారు. మట్టితో పాటు లారీని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం, మట్టి తోలిచ్చుకుంటున్న ఇంటి ఓనర్ను, లారీ ఒనర్ను సీఐ స్టేషన్ కు పిలిపించి కేసు నమోదు చేస్తామని బెదిరించారు. లారీ ఓనరు కేసు పెట్టండని బయట కొచ్చాడు. ఇంతలో గన్ మెన్ రామారావు ఎంటరై, నేసు సీఐతో మాట్లాడతానని చెప్పి, సీఐ చాంబర్లోకి వెళ్ళాడు. కొద్ది సేపటి తర్వాత బయట కొచ్చి, రూ30 వేలు ఇస్తే, లారీని వదిలేస్తామని చెప్పాడు. డబ్బులు ఇవ్వ లేము కేసుపెట్టండని లారీ ఓనరు చెప్పడంతో మళ్ళీ గన్ మెన్ రామారావు సీఐ దగ్గరకు వెళ్ళి, మాట్లాడి వచ్చాడు. ఈ సారి రూ. 20 వేలు ఇవ్వమని అడిగాడు. అతనికి తెలిసిన కార్తీక్ అనే వ్యక్తిని పిలిపించి, అతని బ్యాంకు ఖాతాకు రూ. 20 వేలు ఫోన్ పే చేయించాడు. కేసు నమోదు చేయకుండా లారీని వదిలి పెట్టారు. ఆ తర్వాత, బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఏసీబీ డీఎస్పీ వై రమేష్ బృందం పోలీష్ స్టేషన్ పై దాడి చేశారు. డబ్బులు సీఐ తీసుకో మంటేనే తీసుకున్నామని రామారావు చెప్పడం, ఫోన్ పే చేసినట్లు ఎవిడెన్స్ కూడా ఉండడంతో సీఐ బరపాటి రమేష్ తో పాటు గన్ మెన్ రామారావు, బయటి వ్యక్తి కార్తీక్ ను అరెస్ట్ చేశారు. సీఐ రమేష్ నాకు రూపాయి రాలేదు, నాకు అన్యాయం చేయకండని వెడుకున్నా ఏసీబీ విడిచి పెట్ట లేదు.

Related posts

‘నీట్’ సెగ: తండ్రిని కాల్చి చంపి.. ముక్కలు చేసి డ్రమ్ములో కుక్కిన కొడుకు!

Ram Narayana

బ్యాంక్ స్కామ్ కేసు .. ఈడీ విచారణ ఎదుర్కొన్న నిర్మాత అల్లు అరవింద్

Ram Narayana

యుద్ధం వద్దు శాంతి కావాలి ..ఖమ్మంలో నినదించిన రిటైర్డ్ ఉద్యోగుల

Ram Narayana