తెలంగాణ వార్తలు

అవి ముమ్మాటికీ ప్రభుత్వ భూములే …ఎంపీలు రఘురాంరెడ్డి , కిరణ్ కుమార్ రెడ్డి

సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ హైదరాబాద్ కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి పరిశీలనకు రాగా.. ఆ కమిటీ సభ్యులు సునీల్ లీమాయేను శుక్రవారం ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాంరెడ్డి కలిశారు. ఈ భూములన్నీ ముమ్మాటికీ ప్రభుత్వ భూములేనని, దశాబ్దాల కాలంలో జరిగిన పరిణామాలను వివరించి వినతి పత్రం అందజేశారు ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి వెంట భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు.
సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీ సభ్యుడికి ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి వివరించిన అంశాలు ఇలా..
రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని
సర్వే నంబర్ 25లో గల 400 ఎకరాల భూమి పూర్తిగా ప్రభుత్వానిదే. రెవెన్యూ రికార్డుల ప్రకారం.. “కంచ అస్తబల్ పోరంబోకే ” అంటే ప్రభుత్వ భూమిగా నమోదైంది.
1975లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్ సీయూ)కి కంచ గచ్చిబౌలి లోని సర్వే నం బర్ 25, ఇతర సర్వే నంబర్లలో ఉన్న మొత్తం భూమికి సంబంధించి.. ప్రత్యామ్నయం చూపించారు.
పైన పేర్కొన్న భూమిని అప్పటి రిజిస్ట్రార్ పంచనామాపై సంతకం చేసిన తర్వాతనే.. రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
రెవెన్యూ, అటవీ శాఖల రికార్డుల ప్రకారం ఆ భూమిని అటవీ భూములుగా నిర్ధారించలేదు.

Related posts

పోలీసు అధికారులపై ప్రివిలేజ్ మోషన్… స్పీకర్‌కు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫిర్యాదు!

Ram Narayana

నా పదవి పోయినా సరే…: బెల్టు దుకాణాలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

Ram Narayana

స్టేడియంలో ఈదురుగాలుల బీభత్సం.. ఎంపీ గోడం నగేశ్‌కు త్రుటిలో తప్పిన ముప్పు

Ram Narayana