అంతర్జాతీయం

పహల్గామ్‌ దాడి తర్వాత పాక్ లో టెన్షన్.. సరిహద్దులకు యుద్ధ విమానాలు..!

పహాల్గమ్ టెర్రర్ అటాక్ పట్ల భారత్ సీరియస్ …అత్తరా- వాఘా బోర్డర్ మూసివేత
పాకిస్తాన్ హైకమిషనర్ ను దేశం వదిలి వెళ్లాలని ఆదేశం
భారత్ లో ఉన్న పాక్ పౌరులు కూడా దేశం వీడాలని ఆదేశాలు
సరిహద్దుల్లో ఉన్న సింధు జలాలను వదిలేది లేదని స్పష్టం చేసిన విదేశాంగ శాఖ
పాక్ ప్రేరిపిత ఉగ్రమూకల చర్యలను ముక్త కంఠంతో ఖండించిన భారత్
దేశ వ్యాపితంగా నిరసనలు …


కాశ్మీర్ లోయలో అందాలను తిలకించేందుకు వెళ్లిన పర్యాటకులపై పాక్ ప్రేరిపిత ఉగ్రమూక దాడిచేసి 26 మందిని నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపడాన్ని భారత్ సీరియస్ గా తీసుకున్నది …విదేశపర్యటనలో ఉన్న ప్రధాని మోడీ సంఘటన జరిగిన వెంటనే పర్యటన అర్దరంగా రద్దు చేసుకొని భారత్ చేరుకున్నారు …వెంటనే ఢిల్లీ విమానాశ్రయంలోనే ఉన్నతాధికారులతో సమీక్షా నిర్వహించారు …పాక్ సరిహద్దులను మూసి వేయాలని అధికారులను ఆదేశించారు …రెండు దేశాల మధ్య కీలకంగా ఉన్న అత్తరా-వాఘా బోర్డర్ మూసివేయాలని నిర్ణయించారు …సింధు నది నీటిని పాకిస్తాన్ కు పంపకుండా ఆదేశాలు జారీచేశారు …మనదేశంలు ఉన్న పాక్ పౌరులతోపాటు ,ఆదేశ హైకమిషర్ ను దేశ విడిచి వెళ్లాలని ఆదేశించారు … వివిధ పార్టీలు ప్రజలు పౌరసమాజం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించింది …హోమ్ మంత్రి అమిత్ షా హుటాహుటిన కాశ్మీర్ వెళ్లి భాదితులను పరామర్శించారు …కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే , లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమిత్ షా కు ఫోన్ చేసి తమ సంఘీభావం ప్రకటించారు …ప్రభుత్వం తీసుకునే చర్యలకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు …

ఈ దాడి తర్వాత పాకిస్థాన్ ప్రభుత్వం అప్రమత్తమైందని, భారత సరిహద్దుల వద్దకు యుద్ధ విమానాలను పంపిస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన ఆధారాలుగా నెటిజన్లు ‘ఫ్లైట్ రాడార్’ డాటాకు సంబంధించిన క్లిప్పింగ్ లను పోస్టు చేస్తున్నారు.

ఫ్లైట్ రాడార్ డాటాలో పాకిస్థాన్ వాయుసేన విమానాలు కరాచీలోని దక్షిణ ఎయిర్ కమాండ్ నుంచి లాహోర్, రావల్పిండి సమీపంలోని ఉత్తర వైమానిక స్థావరాలకు చేరుకుంటున్నట్లు కనిపిస్తోంది. రావల్పిండిలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరం పాకిస్థాన్ ముఖ్యమైన ఆపరేషనల్ బేస్‌లలో ఒకటి.. ఈ నేపథ్యంలోనే బేస్ భద్రతా ఏర్పాట్లను పాక్ పటిష్ఠం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, సరిహద్దులకు యుద్ధ విమానాల తరలింపు వార్తలపై అటు పాకిస్థాన్ కానీ, ఇటు భారత అధికారులు కానీ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.

పహల్గాం దాడి ఎఫెక్ట్.. పాకిస్థాన్‌పై భారత్ సంచలన నిర్ణయాలివే!

India Takes Crucial Decisions Against Pakistan After Pahalgham Attack
  • ఉగ్రదాడి వెనుక బయటి శక్తుల ప్రమేయంపై ఆధారాలు లభ్యం
  • పాకిస్తాన్‌తో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత ప్రభుత్వం
  • భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) ఈ నిర్ణయం
  • భారత్ లోని పాక్ టూరిస్టులు, పౌరులు వెంటనే వెళ్లిపోవాలని ఆదేశం
  • వాఘా-అటారీ చెక్ పోస్ట్ నిలిపివేత

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో యాత్రికులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై చేపట్టిన దర్యాప్తులో ఈ దాడి వెనుక బాహ్య శక్తుల హస్తం ఉన్నట్లు బలమైన ఆధారాలు లభించాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఈ నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా అమల్లో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని (ఇండస్ వాటర్ ట్రీటీ) తక్షణమే నిలిపివేయాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. జాతీయ భద్రతకు సంబంధించిన అత్యంత కీలకమైన నిర్ణయాలను ఈ కమిటీయే తీసుకుంటుంది.

ఈ మేరకు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ జమ్ముకశ్మీర్ ఉగ్రవాద దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. ఇండస్ వాటర్ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నామని వెల్లడించారు. అలాగే అటారీ – వాఘా చెక్ పోస్టును కూడా వెంటనే నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. భారత్‌లో ఉన్న పాకిస్థాన్ పర్యాటకులు, పౌరులు వెంటనే వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. ప్రత్యేక వీసాలను కూడా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రేపు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయనుంది.

Related posts

ప్రపంచ స్టార్ అయినా స్వదేశంలో అడుగడుగునా భయం.

Ram Narayana

చైనా మిమ్మల్ని తినేస్తుంది.. కెనడాకు ట్రంప్ హెచ్చరిక…

Ram Narayana

డమ్మీ అయిపోయిన పాక్ ప్రధాని.. పాక్ ఆర్మీ చీఫ్ని కలిసిన అండర్-19 జట్టు!

Ram Narayana