Hydra Police Station
తెలంగాణ వార్తలు

ఈ నెల 8న హైడ్రా కొత్త పోలీస్ స్టేషన్ ప్రారంభం

  • ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైడ్రా స్పెషల్ పోలీస్ స్టేషన్ ను ఈ నెల 8వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. రాణిగంజ్ లోని బుద్ధ భవన్ ను ఆనుకుని ఉన్న భవ నంలోని గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ తో కలిపి రెండు అంతస్తుల్లో ఇది ఏర్పాటు కానుంది, ఈ నెల 8వ తేదీ న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. సర్కారు ఆస్తులను కాపాడే క్రమంలో అక్కడక్కడ ఆస్తు లు కబ్జాలకు, ఆక్రమణకు గురైనట్లు నిర్థారించిన తర్వాత హైడ్రా కూల్చి వేతలు చేపట్టినా, అందుకు బాధ్యులైన వారిపై అమీన పూర్, శేరిలింగంపల్లి తదితర పోలీస్ స్టేషన్లలో ఇప్పటి వరకు నమోదైన 48 కేసులు హైడ్రా పోలీస్ స్టేషన్ కు బదిలీ చేసే అవకాశముంది. వీటిలో ముఖ్యంగా నార్నే సంస్థతో పాటు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తదితరులపై నమోదైన కేసులున్నాయి. ముఖ్యంగా హైడ్రాకు పోలీస్ స్టేషన్ లేక పోవటంతో కబ్జాలకు పాల్పడిన ఆక్రమణదారులపై హైడ్రా వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయించింది. పోలీస్ స్టేషన్ అందుబా టులోకి వచ్చిన తర్వాత ఆక్రమణలు, కబ్జాలకు సంబంధించిన హైడ్రానే నేరుగా కేసులు నమోదు చేసి, నాంపల్లి కోర్టు కాంప్లెక్స్ లో హైడ్రాకు కేటాయిం చిన ప్రత్యేక కోర్టు ముందు నిందితులను హాజరు పర్చనున్నారు.

Related posts

ప్రైవేటు’లో మీకంటే గొప్పవారు ఉన్నారా?: డీఎస్సీ విజేతలతో సీఎం రేవంత్‌

Ram Narayana

మూసీ తీరాన గాంధీ విగ్రహంపై వివాదం: రేవంత్ సర్కార్ నిర్ణయాన్ని తప్పుబట్టిన గాంధీ మునిమనవడు…

Ram Narayana

హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు పనులు వేగవంతం చేయాలి..

Ram Narayana