Thummala Nageswara Rao
తెలంగాణ వార్తలు

ఉచితాలపై తుమ్మల ఆసక్తికర వ్యాఖ్యలు

ఉచితాలపై సవ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే ఉచిత పథకాలను కుదించాల్సిందేనని ఆయన సూచించారు. ఉచిత పథకాలపై తుమ్మల తన అభిప్రాయాన్ని ఓ బలమైన ఉదాహరణతో వివరించారు. ‘‘తినడానికి తిండిలేని వ్యక్తికి బియ్యం ఇవ్వాలి. కానీ, రేషన్ తీసుకొని బజార్లో అమ్మేసే వారికి ఎందుకు ఇవ్వాలి? ఇది అర్ధవంతమైన విధానం కాదు. ప్రభుత్వ నిధులు వ్యర్థంగా పోవకుండా చూడాల్సిన బాధ్యత మనందరిదీ,’’ అని తుమ్మల స్పష్టం చేశారు. ‘‘తెలంగాణ రాష్ట్రంలో కేవలం కోటి పది లక్షల కుటుంబాలున్నాయి. కానీ, రేషన్ కార్డుల సంఖ్య మాత్రం కోటి ఇరవై అయిదు లక్షలు. అంటే ఇతర రాష్ట్రాల వారు కూడా ఇక్కడ కార్డులు పొందుతున్నారన్న అనుమానం రాకమానదు. నిజంగా అర్హులెంతమందో గుర్తించాలి. ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇవ్వడం వల్ల నష్టమే తప్ప లాభం కాదు’’ అని చెప్పారు

Related posts

కరాటే కల్యాణిపై దాడి కేసులో యూట్యూబర్ నరేందర్ అరెస్ట్!

Ram Narayana

ఆ చీప్ ట్రిక్స్ పనిచేయవు.. హైడ్రాను ఆపే ప్రసక్తే లేదు.. తేల్చి చెప్పిన రేవంత్‌రెడ్డి!

Ram Narayana

తెలంగాణలో ఒక కుటుంబం గ్రామ బహిష్కరణ!

Ram Narayana