Narendra Modi
జాతీయ వార్తలు

మూడు సైనిక విభాగాల అధిపతులతో ప్రధాని సమీక్ష

కాగా, భారత్, -పాకిస్థాన్ మధ్య మళ్లీ భీకర యుద్ధం జరుగుతోంది. దీన్ని ఎవరూ కోరుకోకపోయినా.. ఈ యుద్ధం వచ్చేందుకు పాకిస్థాన్ కారణం అయ్యింది. రాత్రి నుంచి రెండు దేశాల మధ్య ఈ యుద్ధం కొనసాగుతోంది. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతోంది. పాకిస్థాన్ ఇండియాలోని 15 నగరాల్లో దాడులు చేస్తుంటే, భారత్, పాక్ లోని 9 నగరాల్లో దాడులు చేస్తోంది. పాకిస్థాన్ 50కి పైగా డ్రోన్లను భారత్ పైకి ప్రయోగించింది. ఐతే.. భారత్ దగ్గర S400 అనే మిస్సైల్ డిఫెన్స్ సిస్టం ఉంది. అందువల్ల దీని ద్వారా భారత్.. పాకిస్థాన్ నుంచి వస్తున్న మిస్సైళ్లను అడ్డుకుంటోంది. అలాగే.. డ్రోన్లను కూడా అడ్డుకొని నాశనం చేస్తోంది. అందువల్ల పాకిస్థాన్ ఏమీ చెయ్యలేని పరిస్థితి ఉంది. ఇప్పటివరకూ ఎవరికీ ప్రాణ నష్టం కలగలేదనీ, ఎక్కడా ఆస్తి నష్టం జరగలేదని భారత రక్షణ శాఖ స్పష్టం చేసింది. దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ పిలుపిచ్చారు. భారత్ చేస్తున్న దాడులతో పాకిస్థాన్ ఉలిక్కి పడింది. ముఖ్యంగా పాక్ రాజధాని ఇస్లామాబాదులో జరిపిన దాడులతో.. అక్కడి సైన్యం అలర్ట్ అయ్యింది. ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ని సురక్షిత ప్రాంతంలోకి తీసుకుపోయింది. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఎమర్జెన్సీ ఉంది. పాక్‌కి సహాయంగా టర్కీ నుంచి ఒక యుద్ధ నౌక వస్తుంటే.. భారత్ 20 యుద్ధ నౌకలను రంగంలోకి దింపుతోంది. అందువల్ల ఏ విధంగానూ పాకిస్థాన్ భారత్‌తో పెట్టుకునే పరిస్థితి లేదు. పాకిస్థాన్ ప్రధానంగా.. జమ్మూకాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ సరిహద్దుల్లో కాల్పులు జరుపుతోంది. ఆ రాష్ట్రాల్లోని నగరాల్లో డ్రోన్లతో దాడులకు యత్నించింది. ఐతే.. ప్రతీ ద్రోణినీ కూల్చేసిన ఆర్మీ.. భారత దేశ సార్వభౌమత్వాన్ని కాపాడే విషయంలో.. ఎక్కడా తగ్గేది లేదని తెలిపింది. పాకిస్థాన్.. హమాస్ తరహాలో దాడులు చేస్తోందనే అంచనాలు ఉన్నాయి. లాహోర్, హెషావర్ సహా.. కీలక నగరాల్లో భారత దాడులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా సరిహద్దుల్లో ఉండే లాహోర్‌కి ఎక్కువ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ యుద్ధంలో తాము జోక్యం చేసుకునేది లేదని అమెరికా స్పష్టం చేసింది. రెండు అణ్వాయుధ దేశాలు కాబట్టి.. త్వరగానే రెండు దేశాలూ.. యుద్ధానికి ముగింపు పలుకుతాయని ఆశిస్తున్నామని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. మరోవైపు తాను మధ్య వర్తిత్వం వహించేందుకు సిద్ధమే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

Related posts

నేను ప్రభుత్వానికి అనుకూలంగా కాదు… శశిథరూర్ స్పష్టీకరణ!

Ram Narayana

రాజమండ్రిలో ‘అఖండ గోదావరి’ పర్యాటక ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేసిన షెకావత్, పవన్ కల్యాణ్

Ram Narayana

ఢిల్లీ లిక్కర్ స్కాం కథాకమామీషు …

Drukpadam