ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పట్టడం మన సంప్రదాయం. మన సోదరి సోదరీమణుల నుదుటి సింధూరం తుడిచిన వారి నట్టింట్లోకి వెళ్లి నాశనం చేశామని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలోనే రెండో అతి పెద్ద వైమానిక స్థావరాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సందర్శించారు. పంజాబ్ లోని అధంపూర్ వైమానిక స్థావరంలో ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్న వాయుసేన సిబ్బందితో ప్రధాని భుజం తట్టి ముచ్చటించారు. అదంపూర్ వైమానిక స్థావరంలో గంటన్నరకు పైగా గడిపిన మోదీతో ఆపరేషన్ సింధూర్ సంబంధించిన వివరాలను వాయుసేన సిబ్బంది పంచుకున్నారు. ఈ సందర్భంగా ‘యుద్ధ క్షేత్రంలోనూ భారత్ నినాదాలు మార్మోగాయి. వీర సైనికులకు సెల్యూట్ చేస్తున్నానని ప్రధాని మోదీ ప్రకటించారు. ఆపరేషన్ సిందూర్ నినాదం ప్రపంచమంతా మార్మోగుతోందని చెప్పారు. భారత్ మాతాకీ జై నినాదం శత్రువుల చెవుల్లో గింగిరాలు తిరుగుతోందని.. అది శత్రువుల వెన్నులో వణుకు పుట్టించిందని పేర్కొన్నారు. అందపూర్ వైమానిక స్థావరంపై దాడి చేసినట్లు పాకిస్థాన్ దుష్ప్రచారం చేసిందని, పాక్ తప్పుడు ప్రచారాన్ని ప్రధాని తిప్పికొట్టారు. ఎస్ 400 క్షిపణి రక్షణ వ్యవస్థ ముందు నిలబడి సెల్యూట్ చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఎస్ 400ను ధ్వంసం చేశామన్న పాకిస్థాన్ దుష్ప్రచారాన్ని కూడా తిప్పికొట్టారు. ఎయిర్ బేస్ కు వెళ్లిన ప్రధాని మోదీ పాకిస్థాన్ కు ఇండియా ఎయిర్ ఫోర్స్ సత్తా చూపారని ప్రశంసించారు.

previous post