ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ లోగోలో స్వల్ప మార్పులు చేసింది. దాదాపు పదేళ్ల తర్వాత గూగుల్ తన ఐకానిక్ లోగోలోను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న లోగోలో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం బాక్సులుగా కనిపించేవి. దీనికి బదులుగా ఇకపై ఎరుపు పసుపు రంగులోకి, పసుపు ఆకుపచ్చ రంగులోకి, ఆకుపచ్చ నీలం రంగులోనే కొత్త గ్రేడియంట్ డిజైన్‌ను తీసుకువచ్చింది. అయితే, గూగుల్ త్వరలో మరి కొన్ని ఆర్టిఫిషియల్ ఫీచర్స్‌ను పరిచయం చేయబోతున్నది. ఈ క్రమంలోనే కంపెనీ కొత్తగా గ్రేడియంట్ డిజైన్లోకి లోగోని మార్చినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం గూగుల్ లోగో ప్రస్తుతం ఐవోఎస్, పిక్సెల్ డివైజ్‌లలో కనిపిస్తున్నది. దాంతో పాటు గూగుల్ 16.18 బీటా వెర్షన్ ఉన్న ఆండ్రాయిడ్ డివైజ్‌లలోనూ ఈ లోగో కనిపిస్తున్నది.
