తెలంగాణ వార్తలు

రాజీవ్ యువ వికాస ఎంపికకుసిబిల్ స్కోర్ అవగాహన లేని ప్రచారం..డిప్యూటీ సీఎం భట్టి

రాజీవ్ యువ వికాస ఎంపికకు
సిబిల్ స్కోర్ అవగాహన లేని ప్రచారం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు

యువతకు స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన రాజీవ్ ఉపాసన పథకం లబ్ధిదారుల ఎంపిక సిబిల్ స్కోర్ ఆధారంగా జరుగుతుందని చేస్తున్న ప్రచారం అవాస్తవమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.మంగళవారం ఇల్లందు నియోజకవర్గంలోని పర్యటించిన ఆయన టేకులపల్లిలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ,అభివృద్ధి కార్యక్రమాలపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించారు …గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని వాటిని సరిదిద్దడానికి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి తాము కృషి చేస్తూనే యువతకు ఉద్యోగాలు కల్పిస్తూనే , రాజీవ్ వికాసం ద్వారా ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు …ఈనెల 15 నాటికి జిల్లా సెలక్షన్ కమిటీకి , 28 నాటికి శాంక్షన్ ప్రక్రియ పూర్తి చేసి… రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నుంచి నియోజకవర్గ వల్ల వారిగా శాంక్షన్ లెటర్ల పంపిణీ జరుగుతుందని అన్నారు ..

ప్రభుత్వపరంగా 57 వేల ఉద్యోగాలు ఇచ్చాము, జాబ్ క్యాలెండర్ ని కూడా ప్రకటిస్తాం… అయినా ఉద్యోగ అవకాశాలు రానీ నిరుద్యోగుల కోసమే దేశంలో ఎక్కడ లేని విధంగా.. యువత స్వయం శక్తితో ఎదిగేలా రాజీవ్ యువ వికాసం పథకం ప్రవేశ పెట్టమని పేర్కొన్నారు ..సిబిల్ స్కోర్ సామాజిక మాధ్యమాల అవగాహన లేని ప్రచారం జరగడాన్ని భట్టి తప్పు పట్టారు …
గత నాలుగేళ్లుగా ఎస్సీ ఇతర కార్పొరేషన్ల లోన్లు తీసుకునే వారికి కాకుండా కొత్తవారికి రుణాలు ఇవ్వాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు ..

ఇల్లందు మహబూబాబాద్ ఈ ప్రాంత ప్రజాప్రతినిధుల వినతుల మేరకు బయ్యారం ప్రాజెక్టు తులారం ప్రాజెక్టుపై సర్వే చేసి… ఈ ప్రాంతానికి నీళ్లు ఇచ్చేలా చిత్తశుద్ధితో చర్యలు చేపడతామన్నారు … మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణను పదేళ్లు పాలించిన బారాస… ఉద్యోగాలు కానీ స్వయం ఉపాధి పొందేలా కానీ ఎటువంటి పథకాలు అమలు చేయలేదన్నారు

టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు లో 33/11 కేవీ విద్యుత్తు సబ్ స్టేషన్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, వైరా ఎమ్మెల్యే రాందాస్,మాజీ ఎమ్మెల్యే పోదాం వీరయ్య సింగరేణి సిఎండి బలరాం ,జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తదితరులు పాల్గొన్నారు

Related posts

దుబాయ్‌లో యాచకుడిగా తెలంగాణ వాసి.. 13 ఏళ్ల తర్వాత సొంతూరికి!

Ram Narayana

మాజీమంత్రి తుమ్మలకు కీలక పదవి ఇచ్చే అవకాశం ..?

Drukpadam

భద్రాచలం ఆలయ ఈవోపై దాడి .. కబ్జాదారులకు మంత్రి కొండా సురేఖ గట్టి హెచ్చరిక

Ram Narayana