Sanjeev Goenka
తెలంగాణ వార్తలు

శ్రీవారికి రూ.7 కోట్ల విలువైన బంగారు ఆభ‌ర‌ణాలు విరాళం

  • భారీ విరాళమిచ్చిన ఐపీఎల్లో ల‌క్నో జ‌ట్టు య‌జ‌మాని సంజీవ్ గోయెంకా
  • దాదాపు ఐదు కిలోల బంగారంతో చేయించిన క‌టి హ‌స్తం, వ‌ర‌ద హ‌స్తాలు

తిరుమ‌ల శ్రీవారికి ప్రముఖ వ్యాపార‌ వేత్త‌, ఐపీఎల్ ఫ్రాంచైజీ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ ) య‌జ‌మాని సంజీవ్ గోయెంకా భారీ విరాళం అంద‌జేశారు. రూ.7 కోట్ల విలువైన బంగారు ఆభ‌ర‌ణాల‌ను స్వామి వారికి బ‌హూక‌రించారు. దాదాపు ఐదు కిలోల బంగారంతో చేయించిన క‌టి హ‌స్తం, వ‌ర‌ద హ‌స్తాల‌ను టీటీడీ అద‌న‌పు ఈఓ వెంక‌య్య చౌద‌రికి అందించారు. ఇక‌, ఐపీఎల్‌లో ఎల్ఎస్‌జీ ఫ్రాంచైజీ ఓన‌ర్ అయిన గోయెంకా గ‌తేడాది జ‌రిగిన మెగా వేలంలో రిష‌భ్ పంత్ ను ఐపీఎల్ చ‌రిత్రలోనే అత్యధికంగా రూ.27 కోట్లకు కొనుగోలు చేసి రికార్డు సృష్టించిన విష‌యం తెలిసిందే. కానీ, ఈ సీజ‌న్‌లో పంత్ అందుకుత‌గ్గ ప్రద‌ర్శన చేయ‌లేక చతికిలప‌డ్డాడు. ఒక‌ వైపు కెప్టెన్సీ, మ‌రోవైపు టోర్నీలోనే కాస్ట్లీ ప్లేయ‌ర్ అనే ట్యాగ్‌తో మ‌నోడు త‌న స్థాయికి త‌గ్గ ప్రద‌ర్శన చేయ‌లేద‌నే చెప్పాలి. ఇప్పటి వ‌ర‌కు 11 మ్యాచ్‌లు ఆడిన ల‌క్నో జ‌ట్టు ఐదు విజ‌యాల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో ఏడో స్థానంలో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్‌ల‌లో గెలిచినా జ‌ట్టు ప్లేఆఫ్స్ అవ‌కాశాలు అంత సులువు కాదు.

Related posts

వరంగల్ కాంగ్రెస్‌లో కొండా మురళి వ్యాఖ్యల దుమారం .. కడియం, రేవూరి ప్రకాశ్ రెడ్డి కీలక సమావేశం!

Ram Narayana

పంజాగుట్ట ఫ్లైఓవర్‌పై వ్యక్తికి మూర్చ.. కాన్వాయ్ ఆపి సాయం చేసిన మంత్రి సీతక్క

Ram Narayana

ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. రెస్క్యూ ఆపరేషన్ కోసం వచ్చిన ‘ర్యాట్ మైనర్స్’

Ram Narayana