Ganja
క్రైమ్ వార్తలు

రూ. 3, 49 కోట్ల విలువైన 698 కిలోల గంజాయి పట్టి వేత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు పెద్ద ఎత్తున నిషేధిత గంజాయిని పట్టుకున్నారు. దాదాపు రూ. 3, 49 కోట్ల విలువ చేసే 698 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శనివారం విశ్వసనీయ సమాచారం మేరకు టేకులపల్లి, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా ముత్యాలం పాడు క్రాస్ రోడ్ సమీపంలోని ఏసీఏ సులానగర్ మినిస్ట్రీ చర్చ్ వద్ద వాహనాలు తనిఖీ చేశారు. అటుగా వస్తున్న ఒక కారు, ఐచర్ వ్యాన్ను ఆపి తనిఖీ చేయగా 698 కిలోల నిషేదిత గంజాయి బయట పడింది. గంజాయిని, వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, పట్టు బడిన గంజాయి విలువ సుమారుగా రూ. 3. 49 కోట్లు వుంటుందని అంచనా వేశారు. ఈ సందర్భంగా రెండు వాహనాల్లో వున్న ఆరుగురిని అదుపులోకి తీసుకొని, 5 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. పట్టు బడిన వారిలో హర్యానాకు చెందిన సందీప్ కుమార్ @ రింకు S/o బల్వీర్ సింగ్, లక్విందర్  S/o పప్పు, అమర్ నాధ్ కుమార్ @ అమర్ నాధ్ S/o సంశేరు సింగ్,  పవన్ కుమార్ S/o అశోక్ కుమార్, రాజ్ కుమార్ @ వినోద్ S/o దిల్ రామ్, కృషన్ కుమార్ @ కాలే S/o జిలే సింగ్ వున్నారు. ఈ ఆరుగురు నిందితులను జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం పోలీసులు కోర్టుకు తరలించారు. అలాగే, గంజాయి అమ్మిన హరి ఖారా, కొనుగోలు చేసిన ప్రిన్స్ కుమార్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు హర్యానాలోని కురుక్షేత్ర జిల్లాకు చెందిన ప్రిన్స్ కుమార్ ఆదేశాలతో పార్సిల్ సర్వీస్ మాటున గంజాయిని రవాణా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని సీలేరు అటవీ ప్రాంతం నుండి హర్యానా ఈ గంజాయిని రవాణా చేస్తున్నట్లు విచారణలో తేలింది. నిషేధిత గంజాయి అక్రమ రవాణాను సమర్థవంతంగా అడ్డుకుని నిందితులను చాకచక్యంగా పట్టుకున్న టేకులపల్లి సీఐ టి.సురేష్, ఎస్సై ఏ. రాజేందర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్, ఎస్సైలు ప్రవీణ్, రామారావు, సిబ్బందిని ఎస్పి రోహిత్ రాజు అభినందించారు.

Related posts

క‌న్హ‌య్య కుమార్‌పై దాడి.. మురుగునీటి కాల్వలో పడిపోయిన మహిళా జర్నలిస్టు..!

Ram Narayana

ఆర్మీ లో ఉద్యోగాల పేరిట ప్రెవేట్ సంస్థ దాష్టికం …

Ram Narayana

58 ఏళ్ల మహిళపై 16 ఏళ్ల టీనేజర్ అత్యాచారం..హత్య..

Drukpadam