Allu Arjun - Revanth Reddy
సినిమా వార్తలు

మళ్లీ పేరు మరచిపోయాడోచ్‌ …

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సమయంలో సినీ పరిశ్రమకు అందించే నంది అవార్డులు ఆగి పోయాయి. అనంతరం ఏపీ, తెలంగాణ ఏర్పడడంతో సినిమా అవార్డులను ప్రభుత్వాలు పట్టించుకో లేదు. పద్నాలుగేళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డుల స్థానంలో గద్దర్‌ పేరిట అవార్డులను ప్రకటించింది. గద్దర్‌ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌కు పురస్కారం లభించింది. గతంలో జరిగిన పరిణామాల కారణంగా తాజాగా అల్లు అర్జున్‌కు గద్దర్‌ అవార్డు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. తనకు అవార్డు ప్రకటించడంపై ‘ఎక్స్‌’ వేదికగా అల్లు అర్జున్‌ స్పందించాడు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఐకాన్‌ స్టార్‌ కృతజ్ఞతలు తెలిపాడు. పోస్టు చేసిన ట్వీట్‌లో ఆసక్తికర విషయం ఉంది. ఈ అవార్డు రావడంపై దర్శకుడు సుకుమార్‌, పుష్ప చిత్రబృందంపై బన్నీ ప్రశంసలు కురిపించాడు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు అని చెప్పాడు మినహా ఎక్కడా ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించలేదు. ఈ ట్వీట్‌ఇప్పుడు వైరల్‌గా మారింది.

Related posts

బలగం చిత్రానికి రెండు అంతర్జాతీయ అవార్డులు!

Drukpadam

అక్కినేని విగ్రహాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు.. తరలివచ్చిన తారాలోకం

Ram Narayana

ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కు రూ.80 కోట్లు ఖర్చు: తమ్మారెడ్డి

Drukpadam