తెలంగాణ వార్తలు

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి టియుడబ్ల్యూజె నిరంతర కృషి

  • టియుడబ్ల్యూజె (ఐజేయు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ
  • మధిరలో ముమ్మరంగా టియుడబ్ల్యూజె (ఐజెయు) సభ్యత్వ నమోదు

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం టియుడబ్ల్యూజే (ఐజేయు) నిరంతరం కృషి చేస్తుందని టియుడబ్ల్యూజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ అన్నారు. మధిర నియోజకవర్గ కేంద్రంలో సోమవారం టియుడబ్ల్యూజే (ఐజేయు) సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం కొంతమంది జర్నలిస్టులకు సభ్యత్వాలను అందజేశారు. ముందుగా ఇటీవల బైపాస్ సర్జరీ చేసుకున్న టీయూడబ్ల్యూజే ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు పాగి బాలస్వామిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కె. రాంనారాయణ మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై అనేక సంవత్సరాలుగా టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించి, పలు సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మండల ప్రాంతాల్లో పని చేస్తున్న జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు సాధించిన ఘనత టియుడబ్ల్యూజె కే దక్కుతుందన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారథిగా వ్యవహరిస్తున్న జర్నలిస్టులకు ఇల్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. అదే విధంగా హెల్త్ కార్డులు ఇవ్వాలని, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలలో జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని తాము కోరగా, ప్రభుత్వం నుండి సానుకూల స్పందన లభించిందన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య అందించాలన్నారు. అనేక సంవత్సరాలుగా జర్నలిస్టుల సమస్యలపై టియుడబ్ల్యూజే (ఐజేయు) పోరాటాలు చేసి విజయం సాధించిందన్నారు. కరోనా బారిన పడిన జర్నలిస్టులకు తమ యూనియన్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు సభ్యత్వ నమోదు ద్వారా వచ్చిన రూ. 8,200 నగదును పాగి బాలస్వామి జిల్లా బాధ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సామినేని మురారి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరరావు, జిల్లా కోశాధికారి నాగెళ్ళ శివానంద్, ఖమ్మం నగర కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. నిమిషం నిబంధన ఎత్తివేత!

Ram Narayana

ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ సర్కార్ తీపికబురు

Ram Narayana

మేడిగడ్డ కుంగుబాటుకు బీఆర్ఎస్ కారణమంటూ కేసు వేసిన రాజలింగమూర్తి దారుణ హత్య!

Ram Narayana