Rajasthan plane crash
ప్రమాదాలు ...

రాజస్థాన్‌లో కుప్పకూలిన యుద్ధ విమానం.. పైలట్ దుర్మరణం

  • రాజస్థాన్‌లోని చూరు జిల్లాలో విమాన ప్రమాదం
  • ఈ ఘటనలో విమానం నడుపుతున్న పైలట్ మృతి
  • ప్రమాద స్థలంలో పైలట్ మృతదేహాన్ని గుర్తించిన అధికారులు
  • సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

రాజస్థాన్‌లో బుధవారం విమాన ప్రమాదం సంభవించింది. చూరు జిల్లాలో ఒక విమానం కుప్పకూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న పైలట్ దుర్మరణం పాలయ్యారు. చూరు జిల్లా పరిధిలోని ఓ ప్రాంతంలో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన జాగ్వార్ ఫైటర్ జెట్ విమానం కూలిపోయినట్లు స్థానిక అధికారులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు, సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అక్కడ విమాన శకలాలను, పైలట్ మృతదేహాన్ని గుర్తించారు. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాద సమాచారం తెలియడంతో ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Related posts

లిఫ్ట్ లో చిక్కుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత…

Ram Narayana

ఎయిర్ క్రాష్ : లండన్ లో ఉన్న భార్యను భారత్ తీసుకొచ్చేందుకు విమానం ఎక్కిన మాజీ సీఎం విజయ్ రూపానీ !

Ram Narayana

బొగ్గు గనిలో పేలుడు…16 మంది మృత్యువాత…

Ram Narayana