మధిరలో బిఆర్ఎస్ కు బిగ్ షాక్..మాజీ ఎమ్మెల్యే కొండబాల కాంగ్రెస్ లో చేరిక ..
మధిరకు చెందిన బీఆర్ యస్ సీనియర్ నాయకుడు , మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు బీఆర్ యస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు …గత కొద్దీ రోజులుగా కొండబాల కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరుగుంది …ఆయన కూడ దాన్ని నిర్దారించారు ..అయితే ఇటీవల బీఆర్ యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం వచ్చిన సందర్భంలో కూడ ఆయనతోపాటు ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు …అయితే అప్పటికే ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది …కొండబాల మొదట కాంగ్రెస్ పార్టీలో చురుకైన నాయకుడిగా , మాజీమంత్రి శీలం సిద్ధారెడ్డి అనుచరుడిగా ఉన్నారు …తరవాత జరిగిన రాజకీయపరిణామాల్లో టీడీపీలో చేరారు …అందులో అనేక పదవులు నిర్వహించారు …భద్రాచలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా వివిధ కార్పొరేషన్ల చైర్మన్ గా పనిచేశారు …ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు …బీఆర్ యస్ లో ఇమడలేక తన మాతృసంస్థ కాంగ్రెస్ లోకి వెళుతున్నట్లు చెప్పారు …అందుకు అనుగుణంగానే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ..
డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సమక్షంలో టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పి కొండబాలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు వారి వెంట బోనకల్ మండల టిఆర్ఎస్ నాయకులు మధిర మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బంధం శ్రీనివాసరావు ఇతర నాయకులు ఉన్నారు.