తెలంగాణ వార్తలు

యూరియా కొరతపై పార్లమెంట్ లో కేంద్రాన్ని నిలదీయండి …ఎంపీలకు తుమ్మల సూచన!

రాష్ట్రంలో యూరియా కొరతపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్లమెంట్ సభ్యులు కేంద్రాన్ని నిలదీయాలని సూచించారు …తెలంగాణపై కేంద్రం సవతితల్లి ప్రేమ చూపుతుందని దీంతో రాష్ట్రానికి రావాల్సిన యూరియా రాకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తుమ్మల పేర్కొన్నారు …యూరియా కొరత అంశాన్ని పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీయాలని కాంగ్రెస్ ఎంపీలను కోరారు.

రాష్ట్రంలో యూరియా కొరత సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర ఎంపీలను కోరారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో రైతులు తీవ్ర యూరియా కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తి, కేటాయింపుల ప్రకారం పూర్తిస్థాయిలో యూరియా సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. 2024-25 సంవత్సరానికి తెలంగాణకు కేంద్రం 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించగా, జులై 31 నాటికి కేవలం 4.36 లక్షల టన్నులు మాత్రమే సరఫరా అయింది. దీంతో ఏడాదికి ఇంకా 2.24 లక్షల టన్నుల కొరత ఏర్పడింది. ఆగస్టు నెలలో 3.50 లక్షల టన్నుల అవసరం ఉండగా, కేవలం 1.70 లక్షల టన్నులు మాత్రమే సరఫరా కావడంతో రైతులు, ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న, వరి పంటలు సాగు చేసే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సమస్యను పరిష్కరించాలని మంత్రి తుమ్మల కేంద్ర ఎరువుల, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు ఇదివరకే లేఖలు రాసి, తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ నుంచి స్వదేశీ యూరియా సరఫరాను 30,800 టన్నుల నుంచి 60,000 టన్నులకు పెంచాలని, ఏప్రిల్-జూన్ మధ్య తలెత్తిన లోటును భర్తీ చేయడానికి అదనపు కోటా కేటాయించాలని కోరారు.

Related posts

పండుగకు ఊరెళుతున్న వారికి తెలంగాణ పోలీసుల సూచనలు

Ram Narayana

వలపు వల.. వీడియోలతో బ్లాక్‌మెయిల్: కరీంనగర్‌లో కిలాడీ దంపతుల అరెస్టు!

Ram Narayana

ఓటుకు రూ.2 వేలు.. సెల్ టవర్ ఎక్కి సర్పంచ్ అభ్యర్థి నిరసన!

Ram Narayana