మావోయిస్టు పార్టీలో గందరగోళానికి దారితీసిన రెండు ప్రకటనలు
ఆయుధాలు వీడుతున్నట్లు ఒకరు …లేదు పోరాటాలు తీవ్రతరం చేస్తామని మరొకరు
మొదటిది అభయ్ పేరిట …రెండవది జగన్ పేరిట
అభయ్ ప్రకటన వ్యక్తిగతమని ప్రకటించిన రాష్ట్ర కమిటీ
దానిపై ఇంకా స్పందించని అభయ్
మావోయిస్టులు తాజాగా చేసిన రెండు విరుద్ధ ప్రకటనలు గందరగోళానికి దారితీశాయి… ఆయుధాలు వీడుతాం శాంతి చర్చలు జరుపుతాం అంటూ అభయ్ ప్రకటన ,ఆడియో టేపు వైరల్ అయింది …అభయ్ ప్రకటన నిజమా..?లేక అబద్దమా అని నిఘా వర్గాలు సైతం ఆరా తీస్తున్న సమయంలో మావోయిస్టు పార్టీ నుంచి ఓ ప్రకటన వెలువడింది…అధికార ప్రతినిధి జగన్ పేరిట వెలువడిన ఈ పత్రిక ప్రకటనలో అభయ్ అలియాస్ సోను ప్రకటన అతడి వ్యక్తిగతమని,అది పార్టీ అధికారిక ప్రకటన కాదని జగన్ ఈ ప్రకటనలో పేర్కొన్నారు … మావోయిస్టు పార్టీ పోరాటాలను తీవ్రతరం చేస్తుందని ఆయన పాలస్తీనా పోరాటాన్ని ప్రకటనలో ఉదహరించారు…బలగాల దాడులతో ప్రాణాలు పోతున్న మాట వాస్తమే ఐయిన ఇంకా పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం తప్ప వెనక్కితగ్గేది లేదని లేఖలో ఆయన స్పష్టం చేశారు … ఒకే పార్టీలో భిన్న వాదనలు ఉండటం సహజమే అవి బయటకు వచ్చేంతగా ఉంటె అదివారికి మరింత నష్టం చేస్తుంది ..అభయ్ ప్రకటన వ్యక్తిగతమని, పార్టీ రాష్ట్ర కమిటీ పేరుతో జగన్ ప్రకటించారు ..దానిపై ఇంకా అభయ్ స్పందించలేదు …
కేంద్రం తేదీలు పెట్టి 2026 మార్చి నాటికీ మావోయిస్టులను అంతం చేస్తామని శపథం చేసి ఏరివేత కొనసాగిస్తున్న సమయంలో ఇలాంటి ప్రకటనలు వారికీ మరింత నష్టం కలిగిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు …ఇప్పటికే మావోయిస్టు పార్టీ అనేకమంది అగ్రనేతలను కోల్పోయింది …ఒక రకంగా చెప్పాలంటే ఆపరేషన్ కగార్ పేరుతో అడవులను తమ ఆధునిక టెక్నాలజీతో జల్లెడ పడుతున్న కేంద్రబలగాలు మావోయిస్టుల రహస్య స్థావరాలను సైతం కనిపెట్టి వారిని వెంటాడి వేటాడుతున్నాయి…పచ్చని అడవులు ,పక్షుల కిలకిల రాగాలతో అడవి బిడ్డలకు భుక్తిని , నీడను ఇస్తున్న చెట్లమధ్య రక్తపుటేరులు ప్రవహిస్తున్నాయి… పకృతి విధ్వంసం జరుగుతుంది … ఈ నేపథ్యంలో ఆపరేషన్ కగార్ ఆపాలని వామపక్షపార్టీలు అభ్యుదయ వాదులు చివరకు కాంగ్రెస్ సైతం కేంద్రానికి విజ్ఞప్తి చేసినప్పటికీ కగార్ ఆపరేషన్ కొనసాగిస్తామని ప్రకటించడం గమనార్హం…

మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ సెప్టెంబర్ 19 న చేసిన ప్రకటన యధాతధంగా…..
కామ్రేడ్ సోనూ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఇచ్చిన ఇచ్చిన తాత్కాలిక సాయుధ పోరాట విరమణ ప్రకటన సోనూ వ్యక్తిగత అభిప్రాయమే గాని పార్టీ నిర్ణయం కాదు.
ప్రియమైన ప్రజలారా!
కేంద్రంలోని బిజెపి పార్టీ విప్లవోద్యమ నిర్మూలనకు ఎప్పటినుండో పథకాలు వేసుకొని అమలు జరుపుతూ 2024 జనవరి నుండి కగార్ అనే పేరుతో భారీ స్థాయి యుద్ధ చర్యలతో నాయకత్వాన్ని, క్యాడర్లను మరియు ప్రజలను కూడా నిర్మూలించే కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. 2025 మార్చిలో కొంత మంది ప్రజాస్వామిక మేధావులు పీస్ డైలాగ్ కమిటీగా ఏర్పడి ప్రభుత్వానికి మావోయిస్టు పార్టీకి మధ్య శాంతి చర్చలు జరగాలనే ప్రతిపాదనను చేసింది. ఆ ప్రతిపాదనకు జవాబుగా కేంద్ర కమిటీ పరిస్థితిని వివరిస్తూ-కూంబింగులు, హత్యాకాండ ఆపాలని కొత్త క్యాంపుల నిర్మాణాన్ని నిలుపుదల చేసి శాంతియుత వాతావరణంలో చర్చలు జరుపాలనే విషయాన్ని కేంద్ర కమిటీ ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సడలింపులు లేకుండా యుద్ధ చర్యలను కొనసాగిస్తూ రక్తపు టేరులు పారిస్తూనే ఉంది. కేంద్ర హోమ్ మంత్రి బా హాటంగానే 2026 మార్చి నాటికి మావోయిస్టు పార్టీని నిర్మూలిస్తానని పదే పదే ప్రకటించాడు. మరొక వైపున తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో ప్రజా సంఘాలు, ప్రజలు కగార్ యుద్ధ కాండను నిలుపుదల చేయాలని అందోళన చేశారు. కగార్ యద్ధ కాండను ఆపాలని దేశ వ్యాప్తంగా ఎంతో మంది మేధావులు, సంఘాలు, ప్రముఖులు విజ్ఞప్తులు చేశారు. మిగతా రాష్ట్రాల్లో కూడా కొన్ని చోట్ల ఈ విషయం మీద సభలు జరిగాయి. మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు కగార్ యుద్ధ కాండను ఆపాలని పెద్దఎత్తున ఆందోళన చేశారు. అయినప్పటికీ ఫాసిస్టు భావజాలంతో రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా నిర్మూలన కార్యక్రమాన్ని కొనసాగించి తీరుతామని బీజేపీ నాయకత్వం ప్రకటిస్తూ వస్తోంది.
ఈ క్రమంలో దాడులు తీవ్రంగా కొనసాగాయి. మే 21న పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్న టీమ్ మీద దాడి జరిగింది. ప్రధాన కార్యదర్శితో సహా 28 మంది కామ్రేడ్స్ అమరులయ్యారు. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ లలో ఘటనలలో కేంద్ర కమిటీ సభ్యులు ఉదయ్ అలియాస్ గాజర్ల రవి, మోడెమ్ బాలకృష్ణ, పర్వేశ్ సోరెన్ (జార్ఖండ్), లు అమరులు అయ్యారు. రాష్ట్ర కమిటీ సభ్యులు గౌతం, భాస్కర్, అరుణ, జగన్ అలియాస్ పండన్న, పండు అలియాస్ చంద్రహాస్ మొదలగువారు అమరులయ్యారు. ఇంకా మరికొద్ది మంది జిల్లా కమిటీ ఏరియా కమిటీ సభ్యులు కూడా అమరులయ్యారు. ఈ పరిస్థితోల్లో కొంత మంది రాష్ట్ర కమిటీ సభులు, క్రింది స్థాయిల కమిటీ సభ్యులు అనారోగ్య సమస్యల రీత్యా పార్టీ అనుమతితో సరెండర్ అయ్యారు.దేశ వ్యాప్తంగా కగార్ ను నిలుపుదల చేయాలని ఆందోళన చేసినప్పటికీ బీజేపీ ప్రజా వ్యతిరేకంగా హింసా ప్రవృత్తితో ఈ హత్యాకాండను కొనసాగిస్తోంది. పైగా మావోయిస్టులతో చర్చించేది లేదని, ఆయుధాలు విడిచి సరెండర్ కావాలని పదే పదే బీజేపీ నాయకులు ప్రకటిస్తున్నారు. మేము చర్చించేది లేదంటూ, మరొక పక్క హత్యకాండను కొనసాగిస్తూ ఉండగా మాకు నెల రోజులు సమయం ఇవ్వాలని అడగటం అనాలోచిత చర్య. కేంద్ర కమిటీ సభ్యుడైన కామ్రేడ్ సోనూ సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నామని ఎక్కడెక్కడో సుదీర్ఘంగా ఉన్న పార్టీ నాయకులతో, కార్యకర్తలతో అభిప్రాయాలు తెలుసుకోవడానికి నెల రోజుల వ్యవధి కావాలని, పార్టీ కమిటీ సభ్యులు తమ అభిప్రాయాలను తాను ఇచ్చిన ఈమెయిల్ అడ్రెస్ పంపాలని కోరుతూ ప్రకటన ఇచ్చాడు. ఈ విధంగా ప్రకటించడం ఏ పద్ధతి అనాలో అర్థం కావటం లేదు. ఉద్యమాన్ని విడిచి ముఖ్యధారలో కలసి లీగల్ గా పనిచేయదలుచుకున్నప్పుడు పార్టీ కమిటీలో చర్చించి అనుమతి పొందవచ్చు. తన అభిప్రాయాన్ని పార్టీ ఛానల్ లో పంపించి ఉంటే తన ప్రశ్నకు జవాబులు దొరికేవి. అది చేయక పోగా ఈ విధంగా ఇటువంటి కీలక విషయాన్ని బహిరంగంగా ప్రకటించడం ద్వారా పార్టీ శ్రేణుల్లోనూ, విప్లవ శిబిరంలోనూ గందరగోళం తలెత్తుంది. తాను అనుసరించిన పద్దతి ఉద్యమానికి ఉపయోగ పడకపోగా నష్టం చేస్తుంది. నేడు దేశంలోని ఏ పార్టీ అయినా ఇటువంటి నిర్ణయాలను ఇంటర్నెట్ ద్వారా బహిరంగ చర్చకు పెట్టి పరిష్కరించాలని ఎవరు అలా చేయరు. అటువంటిది రహస్య పార్టీ, కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాలకు కట్టుబడిన పార్టీ, తీవ్రమైన దమనకాండ అమలు జరుగుతున్న ఈ పరిస్థితుల్లో సరిగ్గా ఆలోసించే వాళ్లు ఇలా చేయరు. నేడు పార్టీలో పై స్థాయి నుండి క్రింది వరకు నేడు ఎదుర్కొంటున్న సమస్య మీద అందరూ తీవ్రంగానే ఆలోచిస్తున్నారు. అనవసరంగా నష్ట పోవాలని ఎవరు అనుకోవటం లేదు. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం ఏ విధంగా బహిరంగా ప్రకటనలతో అయ్యేది కాదు. ఒక భయంకరమైన దమనకాండలో ఇటువంటి నష్టాలు జరుగుతున్నాయని అర్థం చేసుకోవాలి. ఈ సమస్యకు ఇప్పటికీ ఇప్పుడే పరిష్కారం దొరకక పోవచ్చు. 2024లో పాలిట్ బ్యూరో విడుదల చేసిన సర్క్యులర్ను అమలు జరపటమే తక్షణ కర్తవ్యం. నేడు పాలస్తీనా విషయంలో నేడు మారణకాండ జరుగుతున్నదో ప్రపంచ వ్యాప్తంగా అర్థం అవుతుంది. అనగా ప్రపంచ వ్యాప్తంగానే దమనకాండ స్థాయి పెరిగిందని అర్థమవుతుంది. ఇంటువంటి పద్ధతులు ఉద్యమానికి నష్టం కలిగించేవే కానీ ప్రయోజనం ఏ మాత్రం లేనివి. ఇది పార్టీ అధికారిక ప్రకటన కాదు. విప్లవ శిబిరం, మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు దీనిని అధికారిక ప్రకటనగా గుర్తించాల్సిన అవసరం లేదు. ఈ ప్రకటనతో గందరగోళ పడాల్సిన అవసరం లేదు. ఫాసిస్టు బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు తీవ్రతరం చేయాలి.
జగన్
అధికార ప్రతినిధి

ఆ ప్రకటనతో మాకు సంబంధం లేదు.. అది అభయ్ వ్యక్తిగత అభిప్రాయం: మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్..

- మవోయిస్టు అభయ్ ప్రకటనను ఖండించిన మరో అధికార ప్రతినిధి జగన్
- అభయ్ విడుదల చేసిన లేఖ అధికారిక ప్రకటన కాదని వెల్లడి
- ఆయుధ విరమణపై పార్టీగా ఏ నిర్ణయం తీసుకోలేదన్న జగన్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభయ్ ప్రకటనపై మావోయిస్టు పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధిగా గుర్తింపు పొందిన అభయ్ ఇటీవల విడుదల చేసిన లేఖలో పార్టీ సాయుధ పోరాటాన్ని విరమించడానికి సిద్ధమని ప్రకటించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే, తాజాగా మావోయిస్టు పార్టీ మరో అధికార ప్రతినిధి జగన్ ఈ ప్రకటనను పూర్తిగా ఖండించారు.
జగన్ విడుదల చేసిన ప్రకటనలో, అభయ్ విడుదల చేసిన లేఖ తమ పార్టీ అధికారిక ప్రకటన కాదని, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయంగా పేర్కొన్నారు. “అభయ్ లేఖలోని అంశాలు పార్టీ అంగీకారంతో వెలువడినవి కావు. అది ఆయన వ్యక్తిగతంగా చేసిన ప్రకటన మాత్రమే. పార్టీ విధానం ప్రకారం, ఈ తరహా కీలక ప్రకటనలు అధికారిక చర్చల తర్వాత మాత్రమే వెలువడాలి. ఆయుధ విరమణపై పార్టీగా ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు” అని జగన్ స్పష్టం చేశారు.
ఈ వ్యాఖ్యలు మావోయిస్టు పార్టీ అంతర్గత విభేదాలను బహిర్గతం చేస్తున్నాయి. అభయ్ ఆగస్టు 15న రాసినట్లు భావిస్తున్న లేఖ తాజాగా వెలుగులోకి వచ్చి సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆ లేఖలో ఆయుధాల విరమణపై ఆయన వ్యక్తిగత నిర్ణయాన్ని ప్రకటించడం, కేంద్ర ప్రభుత్వాన్ని శాంతి చర్చలకు ఆహ్వానించడం వంటి అంశాలు ఉన్నాయి.
అభయ్ లేఖలో, తమ పార్టీ మాజీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు (అలియాస్ బసవరాజు) హత్యకు ముందు నుంచే శాంతి చర్చల ప్రస్తావన ప్రభుత్వానికి ఉందని, ఇప్పుడు ఆ మార్గాన్ని ముందుకు తీసుకెళ్లాలనే దృక్పథాన్ని పేర్కొన్నారు. హోంమంత్రి అమిత్ షా మొదలుకొని ప్రధాని మోదీ వరకు అనేక మంది ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని చేసిన విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని సాయుధ పోరాటం విరమించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
అయితే, జగన్ దీనికి భిన్నంగా స్పందించారు. ఆయుధ విరమణపై చర్చ జరగకుండా, పార్టీ అనుమతి లేకుండా ఈ రకమైన ప్రకటనలు చేయడం తీవ్రమైన పార్టీ విధి ఉల్లంఘనగా పేర్కొన్నారు. అభయ్ చర్య పార్టీకి నష్టం కలిగించేదిగా ఉందని ఆయన స్పష్టం చేశారు. “శాంతి చర్చలపై గత కొన్ని నెలలుగా మేమే ముందుకొస్తున్నాం. కానీ అది ఆయుధ విరమణగా కాదు, చర్చల వాతావరణం కోసం కాల్పుల విరమణగా మా డిమాండ్ ఉంది” అని జగన్ తెలిపారు.