తెలంగాణ వార్తలు

సింగరేణి టెండర్ల విషయంపై సిబిఐ విచారణ జరపాలి.. పొంగులేటి సుధాకర్ రెడ్డి

సింగరేణి టెండర్లుపై ఛీఫ్ విజిలెన్స్ కమిషన్, సిబిఐ తో విచారణ జరిపించాలని బిజెపి జాతీయ నాయకులు డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సింగరేణిలో జరుగుతున్న అక్రమాలు వారి సొంత వ్యవహారం కాదని ఇది ప్రజలకు సంబంధించిన అంశం. అందువల్ల నిజాలు నిగ్గు తేలాలంటే సమగ్ర దర్యాప్తు అవసరమన్నారు.. ఇప్పటివరకు జరిగిన టెండర్ల వ్యవహారంలో అక్రమాలపై కూడా సమగ్ర దర్యాప్తు అవసరమైన అభిప్రాయపడ్డారు.
2014 నుంచి ఇప్పటి వరకు సింగరేణి లో జరుగుతున్న వ్యవహారాలపై   సమగ్ర దర్యాప్తు జరిపితే గాని అసలు విషయాలు బయటకు రావు అన్నారు.
సింగరేణి ప్రజల ఆస్తి, ఇందులో జరుగుతున్నట్టు చెబుతున్న అక్రమాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కోట్లాది రూపాయల ప్రజల సొమ్ము దుర్వినియోగం అయినట్లు తెలుస్తుంది.   త్వరలో వీటిని ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని  సుధాకరరెడ్డి తెలిపారు.

Related posts

నేడోరేపో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ…శాఖల మార్పు జరిగే అవకాశం…

Ram Narayana

వాహనదారులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్…

Ram Narayana

బటన్ నొక్కితే కారు నంబర్ ప్లేట్ చేంజ్..!

Ram Narayana