తెలంగాణ వార్తలు

సుప్రీంతీర్పు గైడ్‌లైన్స్‌ ప్రకారంగానే జర్నలిస్టులకు స్థలాలు

సుప్రీంతీర్పు గైడ్‌లైన్స్‌ ప్రకారంగానే జర్నలిస్టులకు స్థలాలు

ప్రభుత్వానికి విచక్షణాధికారం ఎలైట్‌ పీపుల్స్‌తో జర్నలిస్టులను పొల్చవద్దు

జర్నలిస్టులకు లీగల్‌ ఒపీనియన్‌ అనుకూలమని
అభిప్రాయపడిన హైకోర్టు మాజీ న్యాయమూర్తులు , న్యాయవాదులు


జవరహర్‌లాల్‌ నెహ్రు జర్నలిస్టు హౌసింగ్‌ సొసైటీ(JNJ) జర్నలిస్టులకు సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ ప్రకారంగా ఇళ్ల స్థలాలు ఇచ్చే వెసులుబాటు ఉందని న్యాయకోవిదులు అభిప్రాయపడ్డారు. సుప్రీం తీర్పులోనే సంక్షేమ రంగాలకు పెద్దపీట వేయడానికి ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయని పేర్కొందన్నారు.

ఆదివారం జవహర్ లాల్ నెహ్రు జర్నలిస్టు హౌసింగ్‌ సొసైటీ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన “ఇళ్ల స్థలాలు- మార్గదర్శనం” అంశంపై న్యాయనిపుణులతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్‌ బీఎస్‌ నారాయణ, జస్టిస్‌ చంద్రకుమార్‌, సీనియర్‌ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి జర్నలిస్టులకు స్థలాలు ఇచ్చే వెసులుబాటు ఇచ్చిందని, గత 18 ఏళ్లుగా డబ్బులు కట్టి ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్న జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

సుప్రీం సూచనల మేరకు స్థలాలు ఇవ్వచ్చు: జస్టిస్‌ పీఎస్‌ నారాయణ
జర్నలిస్టులకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో దారులు మూయలేదని, అదే తీర్పులో ఇచ్చిన నిబంధనల మేరకు ఇచ్చే అవాకశం ఉందన్నారు.

సుప్రీం తీర్పులో ప్యారా నెంబర్‌ 95లో పొందుపర్చిన అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు. అలాగే బేసిక్‌ రేట్‌ కంటే అదనంగా మార్కెట్‌ రేటను కోడ్‌ చేసిన నేపథ్యంలో ఆ సూచనలు పరిగణలోకి తీసుకోవాల్సి ఇవ్వడానికి వెసులుబాటు ఉందన్నారు.

తలదాచుకోవాడనికి గృహ నివాసం ఏర్పాటు చేసే అంశం ప్రజాస్వమ్య వ్యవస్థలో ప్రాథమిక అంశంగా చేర్చిన విషయాన్ని దృస్టిలో పెట్టుకోవాలన్నారు. ఎలైట్‌ పీపుల్స్‌ (ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఎమ్మెల్యేలు, ఎంపీలు) మాదిరిగా జర్నలిస్టులను చూడకుండా వారి ఆర్థిక స్థితిగతులను పరిగణలోకి తీసుకోవాలన్నారు.

ఐఏఎస్‌, ఐపీఎస్‌ ఎమ్మెల్యేలకు ఎంత వేతనాలున్నాయి..? వారిజీవన ప్రమాణాలు ఎలాఉన్నాయి..? రిటైర్‌మెంట్‌ తర్వాత వచ్చే ఫెన్సన్‌ ఎంత ఉంది..? అనేది జర్నలిస్టుల జీవన ప్రమాణాలపై బేరీజు వేయాలన్నారు. జర్నలిస్టుల దయనీయ పరిస్థితిని ప్రభుత్వాలు అర్థం చేసకుని వారికి సంక్షేమాన్ని అందివ్వడంలో న్యాయవ్యవస్థ తప్పుపట్టే అవకాశం లేదన్నారు. సప్రీం మార్గదర్శకాలకు లోబడి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సీనియర్‌ న్యాయకోవిదులు తమతమ లీగల్‌ ఒపినీయన్‌ ఇచ్చారని అన్నారు.

సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులైన సిద్దార్థ లూథ్రా, శేషాధ్రినాయుడు, హైకోర్టు సీనియర్అడ్డకేట్లు వేదుల వెంకట రమణ, చిక్కడు ప్రభాకర్‌ ఇచ్చిన లీగల్‌ ఒపీనియన్‌ ప్రకారంగా జర్నలిస్టులకు గతంలో కేటాయించిన పేట్‌బషీరాబాద్‌, నిజాంపేట స్థలాలను ఇచ్చే వెసులుబాటు కల్పించిందన్నారు.
ఆర్థిక అసమానతలు పరిగణన లోకి తీసుకోవాలి : జస్టిస్‌ చంద్రకుమార్‌
రాష్ట్రంలో పని చేస్తున్న ప్రభుత్వ ఉన్నతోద్యోగులైన ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఎమ్మెల్యేలతో పాటు జర్నలిస్టుల ఆర్థిక ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఫోర్త్‌ ఎస్టేట్‌లో పిల్లర్‌గా ఉన్న జర్నలిస్టులు ఆర్థికంగా మిగతి వారితో సమానంగాలేరు కాబట్టి వీరిని ఎలైట్‌గ్రూపులో కలుపడం భావ్యం కాదన్నారు. ఎలైట్‌ గ్రూపు జీవన ప్రమాణాలు చాలా రిచ్‌గా ఉంటాయి. కానీ, జర్నలిస్టుల జీవన ప్రమాణాలు దరిద్రంగా ఉంటాయని వివరించారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు వారిని గుర్తించి, వారికి సంక్షేమం ఏర్పాటు చేయాల్సి బాధ్యతను తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం జవహర్‌లాల్‌ నెహ్రు జర్నలిస్టు సొసైటీ సభ్యులకు ఇళ్ల స్థలాల ఆశచూపుతూ 18 ఏళ్లు గడిపింది. దాదాపు80 మంది మృత్యువాతపడినట్లు చెపుతున్నారు. ఇంకెతంత కాలం ఇళ్లులేని బతుకులని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు సప్రీంకోర్టుతీర్పును బూచీగా చూపాల్సిన అవసరం లేదన్నారు. సుప్రీం తీర్పులోని అంశాల ప్రకారంగానే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తీర్పులో వెలువరించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి స్థలాలు సాధించుకోవాలని జస్టిస్‌ చంద్రకుమార్‌ జర్నలిస్టులకు సూచించారు. అనంతరం హైకోర్టు సీనియర్‌ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ మాట్లాడుతూ ప్రత్రా రంగంలో పనిచేసే జర్నలిస్టులకు ఒకే న్యాయం ఉండాలన్నారు. కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి మిగతా వారికి ఇవ్వకుండా చేయడమనేది మౌళిక సూత్రాలకు విరుద్ధమని అన్నారు.

ఇప్పటికే మూడు దఫాలుగా సీనియర్‌ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తే వారు ఆ లబ్ధిని అనుభవిస్తున్నారు.. మరి జవహర్‌లాల్‌ సొసైటీ జర్నలిస్టులు ఎందుకు అనుభవించకూడదని ప్రశ్నించారు. అందరికీ ఒకే న్యాయం, ఒకే చట్టం వర్తింపజేయాలన్నారు. జవహర్‌లాల్‌ సైసైటీ జర్నలిస్టులకు ఇచ్చిన జీవోలోని మార్గదర్శకాలకు అనుగుణంగానే రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఇళ్ల స్థలాలను ఆయా జర్నలిస్టులకు అందించింది. మరి హైదరాబాద్‌లో ఎందుకు ఇవ్వరని చిక్కుడు ప్రశ్నించారు. జర్నలిస్టులందరికీ ఒకే న్యాయం ఉండాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పులోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కొన్ని మార్గదర్శకాలు సూచించింది.

ఆ ప్రకారంగానే ఇళ్ల స్థలాలు ప్రభుత్వానికి ఇచ్చే అధికారం ఉందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగానే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఏవిధంగా ఇవ్వవచ్చనే దానిపై సీనియర్‌ న్యాయవాదులు లీగల్‌ ఒపీనియన్లు అందించారని, వాటిని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఇప్పటికే కేటాయించి ఉన్న స్థలాలను ఇచ్చే వెసులుబాటు ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో జవహర్‌లాల్‌ నెహ్రు జర్నలిస్టు సొసైటీ డైరెక్టర్లు పీవీ రమణారావు, కొండం అశోక్‌రెడ్డి లతో పాటు సీనియర్‌ జర్నలిస్టులైన సొసైటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

కవిత మరో వైఎస్ షర్మిల: బండి సంజయ్

Ram Narayana

రొట్టమాకురేవు కవిత్వఅవార్డు గురించి…కవి యాకుబ్ మాటల్లో …

Ram Narayana

సీఎం సహాయ నిధికి రూ.2కోట్లు అందజేసిన ఖమ్మం ఎంపీ

Ram Narayana