జాతీయ వార్తలు

అజిత్ పవార్ అంతిమయాత్రలో చోరీ.. ఏడుగురి అరెస్టు…

  • అజిత్ పవార్ అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు
  • బంగారం, ఖరీదైన వస్తువులు పోయినట్లు 15 మంది ఫిర్యాదు
  • ఏడుగురు అనుమానితులను అరెస్టు చేసిన పోలీసులు

విమాన ప్రమాదంలో మృతి చెందిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు గత గురువారం బారామతి విద్యాప్రతిష్ఠాన్ మైదానంలో జరిగాయి. ఆ సమయంలో కొంతమంది దొంగలు చేతివాటం ప్రదర్శించారు. అజిత్ పవార్ అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అంత్యక్రియల అనంతరం పదిహేను మంది తమ బంగారం, ఇతర ఖరీదైన వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చోరీకి గురైన వస్తువుల విలువ సుమారు రూ.30 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం ఏడుగురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. 

Related posts

ఈ బైబిల్ పొడవు 100 కిలోమీటర్లు… చేతితో రాశారు!

Ram Narayana

పహల్గామ్ బాధితులపై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు!

Ram Narayana

సెబీ చీఫ్‌పై హిండెన్‌బర్గ్ ఆరోపణలు.. స్పందించిన రాహుల్ గాంధీ!

Ram Narayana