కొత్తగూడెం మేయర్ పీఠం కాంగ్రెస్ -సిపిఐ మధ్య కుదిరిన ఒప్పందం
మేయర్ గా చేరి రెండున్నర సంవత్సరాలు
డిప్యూటీ మేయర్ కూడా అంతే
సీఎం సమక్షంలో శనివారం అర్ధరాత్రివరకు చర్చలు
కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి
సిపిఐ పార్టీ నుంచి పల్లా వెంకట్ రెడ్డి , టి .నర్సింహా ,మీడియా అకాడమీ చైర్మన్ కె .శ్రీనివాస్ రెడ్డి
ఒప్పంద వివరాలు వెల్లడించిన పీసీసీ చీఫ్ , సిపిఐ నేత పల్లా వెంకటరెడ్డి


కొత్తగూడెం కార్పొరేషన్ విషయంలో ఎవరు మేయర్ కావాలి ,ఎవరు మద్దతు ఎవరు తీసుకుంటారు..సిపిఐ పార్టీ బీఆర్ యస్ ఇచ్చిన ఆఫర్ ను అంగీకరిస్తుందా ..అనే చర్చల మధ్య చివరకు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన నివాసంలో జరిగిన సమావేశంలో ఒప్పందాన్ని వచ్చారు ..కాంగ్రెస్ -సిపిఐ జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో ఉండటమే కాకుండా గత అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రులుగా కలిసి పోటీచేసినందున దేశంలో మత శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్న క్రమంలో దాన్ని ఇక్కడ కూడా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు ..మేయర్ ఐదు సంవత్సరాల కాలంలో చేరి రెండున్నర సంవత్సరాలు తీసుకోవాలని ఒప్పందం చేసుకున్నారు …అందులో భాగంగా మొదట రెండున్నర సంవత్సరాలు తమకే కావాలని సిపిఐ కోరగా అందుకు అంగీకారం కుదిరింది ..మొదట సిపిఐ మేయర్ పీఠం పై కూర్చుంటుంది ..డిప్యూటీ మేయర్ గా కాంగ్రెస్ నుంచి ఉంటారు ..సీఎం నివాసంలో జరిగిన చర్చల్లో కాంగ్రెస్ నుంచి సీఎం తోపాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ,మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , సిపిఐ పార్టీ నుంచి ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి , సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి టి .నరసింహ ,మీడియా అకాడమీ చైర్మన్ కె .శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు ..రెండు పార్టీల మధ్య కుదిరిన ఒప్పంద వివరాలను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ , సిపిఐ నాయకులు పల్లా వెంకట రెడ్డి మీడియా కు వివరించారు ..
మేయర్ గా 31వ డివిజన్ సిపిఐ అభ్యర్థి నునావత్ శ్యామల దినేష్,,?
కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ బరిలో 31వ డివిజన్ సిపిఐ అభ్యర్థి నునావత్ శ్యామల దినేష్
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి ఎస్టి అభ్యర్థికి రిజర్వ్ కావడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో సిపిఐ తరఫున అత్యధిక మెజారిటీతో గెలుపొందిన 31వ డివిజన్ కార్పొరేటర్ నునావత్ శ్యామల దినేష్ ని మేయర్ అభ్యర్థిగా సిపిఐ అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం.