ఆంధ్రప్రదేశ్

ప్రియురాలితో ప్రయాణం చేయించలేదని …!

  • ఇద్దరు ప్రేమికులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో సీట్లు బుక్ చేసుకున్న వైనం
  • బుకింగ్ సమయంలో యువతుల పేర్లతో సీట్లు నమోదు
  • యువతి పక్క సీటులో యువకుడిని కూర్చోవడానికి అంగీకరించని డ్రైవర్
  • మచిలీపట్నంలో బస్సు దిగిన తర్వాత డ్రైవర్ పై యువకుడు దాడి చేసిన వైనం

ప్రియురాలి కోసం ఓ యువకుడు ప్రైవేట్ ట్రావెల్ బస్ సిబ్బందిపై దాడి చేసిన ఘటన కృష్ణాజిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

హైదరాబాద్ నుంచి మచిలీపట్నానికి ప్రయాణించేందుకు ఇద్దరు ప్రేమికులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో సీట్లు బుక్ చేసుకున్నారు. అయితే బుకింగ్ సమయంలో యువతుల పేర్లతో రెండు సీట్లు నమోదు చేశారు. ఆ సీట్లలో సదరు యువకుడిని కూర్చోనివ్వడానికి బస్ డ్రైవర్ నిరాకరించాడు. దీంతో బస్ సిబ్బందితో యువకుడు వాగ్వాదానికి దిగాడు. 

ఈ క్రమంలో మచిలీపట్నం బస్టాండ్ సెంటర్‌లో ప్రేమికులు బస్సు దిగారు. ఇద్దరినీ పక్కపక్కనే కూర్చోనివ్వని డ్రైవర్‌ను వదలొద్దని యువతి చెప్పడంతో యువకుడు మరింత రెచ్చిపోయాడు. అనంతరం చిలకలపూడి సెంటర్‌లో డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డాడు. 

దాడిలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కావడంతో అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Related posts

ఓ వ్యక్తి తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారం ఇస్తున్నాడు… సీఎం చంద్రబాబు

Ram Narayana

ఉద్యమం కొనసాగించాలని ఏపీ టీచర్స్ ఫెడరేషన్ నిర్ణయం!

Drukpadam

సీఎల్పీ నేత భట్టి …మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి మధ్య వార్

Drukpadam