తెలుగు రాష్ట్రాలు

నా జీవితంలో ఆ అధ్యాయం ముగిసిపోయింది: మంచు లక్ష్మి

  • ఐదేళ్ల క్రితం నిర్మించిన ఒక సినిమా తీవ్ర నష్టాలను మిగిల్చిందన్న మంచు లక్ష్మి
  • ఇప్పటికీ అప్పులు కట్టుకుంటున్నానని వెల్లడి
  • నిర్మాణ రంగం నుంచి తప్పుకుంటున్నానని ప్రకటన

టాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ నటిగా మంచి పేరు తెచ్చుకున్న మంచు లక్ష్మి సినీ నిర్మాణ రంగంలో కూడా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమా నిర్మాణ రంగం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఒక బాధాకరమైన విషయాన్ని పంచుకున్నారు. ఐదేళ్ల క్రితం తాను నిర్మించిన ఒక సినిమా తీవ్ర నష్టాలను మిగిల్చిందని ఆమె తెలిపారు. ఆ నష్టాలు ఇప్పటికీ తనను వెంటాడుతున్నాయని చెప్పారు. ఆ సినిమా కోసం చేసిన అప్పులను ఇప్పటికీ కట్టుకుంటున్నానని తెలిపారు. అందుకే నిర్మాతగా తన జీవితంలో ఆ అధ్యాయం ముగిసిపోయిందని చెప్పారు. ఇకపై నటనపైనే పూర్తి దృష్టి పెడతానని తెలిపారు.

Related posts

జగన్ తన మేనల్లుడికి, మేనకోడలికి అన్యాయం చేశాడు: వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన…

Ram Narayana

ఏపీ అనే పిలుస్తున్నారు.. అక్కడ తెలుగును సముద్రంలో కలిపేశారు: గరికపాటి

Ram Narayana

కొణిజేటి రోశయ్య నిఖార్సైన హైదరాబాదీ: రేవంత్ రెడ్డి

Ram Narayana