- వనస్థలిపురంలోని గ్రీన్ సిటీ కాలనీలో దారుణం
- ఏడాది క్రితం మహేశ్‌కు విడాకులు ఇచ్చిన సునీత
- కత్తులు, పెట్రోల్ తో ఇంట్లోకి ప్రవేశించి హత్య
తనకు విడాకులు ఇచ్చిందన్న కారణంతో ఒక వ్యక్తి తన మాజీ భార్యను హతమార్చిన సంఘటన హైదరాబాద్‌లో జరిగింది. వనస్థలిపురంలోని గ్రీన్ సిటీ కాలనీలో ఓ ఆపార్టుమెంట్‌లో ఉంటున్న సునీతకి గతంలో మహేశ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. మనస్పర్థలు రావడంతో ఇరువురు విడిపోయారు. సునీత ఏడాది క్రితం అతడికి విడాకులు ఇచ్చి, మరొక వ్యక్తిని వివాహం చేసుకుంది.
దీంతో మహేశ్ ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఆమె ఇంట్లోకి కత్తులు, పెట్రోల్ డబ్బాతో చొరబడి దారుణంగా హత్య చేశాడు. ఇంట్లోకి ఎవరైనా వస్తే పెట్రోల్ పోసి నిప్పంటిస్తానని బెదిరించాడు. ఘటన అనంతరం మహేశ్ పారిపోతుండటం గమనించిన అపార్టుమెంట్ వాసులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: