రాజకీయ విమర్శలు చేసేటప్పుడు భాషా సంస్కారం ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేరళ ముఖ్యమంత్రి ఘాటు లేఖరాశారు …కేరళ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నవేళ ఆ రాష్ట్రంలో ప్రత్యర్థులుగా ఉన్న సిపిఎం ,కాంగ్రెస్ లమధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది …ఇటీవల ఎన్నికల ప్రచారానికి కేరళ వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేరళ ప్రభుత్వంపైనా , సీఎం పినారవి విజయంపై చేసిన విమర్శలపై విజయం ఘాటుగానే బదులిచ్చారు …
కేరళ, తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య సోషల్ మీడియా వేదికగా సాగుతున్న మాటల పై కేరళ ప్రభుత్వ పనితీరుపై రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు స్పందిస్తూ, కేరళ సీఎం పినరయి విజయన్ ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు.
రాజకీయ విబేధాలను పరిష్కరించుకోవడానికి వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని ఆయన రేవంత్‌కు హితవు పలికారు.
కాంగ్రెస్‌పై విమర్శలు..
గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేరళకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి అనేక ప్రాజెక్టుల విషయంలో మొండిచేయి చూపిందని, కొచ్చి మెట్రో వంటి ప్రాజెక్టులను ఆలస్యం చేసిందని విజయన్ ఆరోపించారు. లేఖ చివరలో విజయన్ మలయాళంలో ఒక శక్తివంతమైన వ్యాఖ్య చేశారు. “మేము ముందుకు వెళ్తాము.. కేవలం ముందడుగు మాత్రమే వేస్తాం. ‘నవ కేరళ’ నిర్మాణంతో అందరికీ ఆదర్శంగా నిలుస్తాం. రాజకీయ విమర్శలు చేసేటప్పుడు భాషా సంస్కారం ఉండాలని, హద్దులు దాటి మాట్లాడటం సరికాదని కాంగ్రెస్ పార్టీ కు పినరయి విజయన్ ఈ లేఖ ద్వారా స్పష్టమైన హెచ్చరిక పంపారు.