కరోనా టీకాలు వేయించుకుంటే ముప్పా…?
గుండె సంబంధిత వ్యాధిలు వస్తున్నాయా …?
ఫ్లోరిడా జనరల్ సర్జన్ డాక్టర్ జోసెఫ్ ఏమి చెపుతున్నారు
18 -39 సంవత్సరాల వాళ్లలో రిస్క్ ఎక్కువగా ఉందా …?
కరోనా టీకాలు వేయించుకుంటే ముప్పు ఉందని ,ప్రత్యేకించి గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయని అమెరికాకు చెందిన జనరల్ సర్జన్ డాక్టర్ జోసెఫ్ చెప్పిన మాటలను ప్రపంచాన్ని ఆలోచనలో పడేసింది. ప్రత్యేకించి యువకులలో ఈ రిస్క్ ఎక్కువని చెప్పడం దేశంలో ఇటీవల కాలంలో అనేకమంది యువకులు గుండె పోటుతో మరణించడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. దీనిపై పాలకులు ఆలోచనలు చేయాలి …
కరోనా టీకాలు వేయించుకున్న వారిలో గుండె సంబంధిత సమస్యలతో మరణించే ముప్పు ఎక్కువగా ఉందని అమెరికాలోని ఫ్లోరిడా సర్జన్ జనరల్ డాక్టర్ జోసెఫ్ వెల్లడించారు. ఎంఆర్ఎన్ఏ రకం వ్యాక్సిన్లు వేయించుకున్న 18-39 ఏళ్ల మధ్య వయసున్న పురుషుల్లో ఈ ముప్పు ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. ఫ్లోరిడా ఆరోగ్యశాఖ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
కరోనా టీకాలు వేయించుకున్న వారిలో గుండె సంబంధిత సమస్యలతో మరణించే రిస్క్ పెరుగుతోందని ఫ్లోరిడా సర్జన్ జనరల్ డాక్టర్ జోసెఫ్ ఏ లడపో తెలిపారు. కోవిడ్-19 ఎంఆర్ఎన్ఏ టీకాలు వేయించుకున్న.. 18 నుంచి 39 ఏళ్ల మధ్య వయసున్న పురుషుల్లో గుండె సంబంధిత సమస్యలతో మరణించే ముప్పు ఎక్కువగా ఉందని డాక్టర్ జోసెఫ్ తెలిపారు. నిజాలను బయటపెట్టే విషయంలో తాము సైలెంట్‌గా ఉండలేమని ఆయన ట్వీట్ చేశారు.
వ్యాక్సిన్ ఎంత మేరకు సురక్షితమో తేల్చే సెల్ఫ్ కంట్రోల్డ్ కేస్ సిరీస్ ద్వారా ఫ్లోరిడా హెల్త్ డిపార్ట్‌మెంట్ ఓ అనాలిసిస్ నిర్వహించింది. కోవిద్ -19 వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో మరణించే ముప్పు అధికంగా ఉందని ఈ అధ్యయనంలో తేలింది. వ్యాక్సిన్ తీసుకున్న 28 రోజుల్లోపు 18-39 ఏళ్ల మధ్య వయసున్న పురుషుల్లో గుండె సంబంధిత సమస్యలతో మరణించే ముప్పు 84 శాతం పెరిగినట్లు ఈ అధ్యయనంలో గుర్తించారు.