ఆంధ్రప్రదేశ్

సీబీఐ అధికారులు రావడంతో ఇంటి తలుపులు వేసుకున్న వివేకా పీఏ!

సీబీఐ అధికారులు రావడంతో ఇంటి తలుపులు వేసుకున్న వివేకా పీఏ!

  • వివేకా హత్య కేసు విచారణలో వేగం పెంచిన సీబీఐ
  • పులివెందులలో వివేకా పీఏ ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులు
  • ప్రస్తుతం బెయిల్ పై ఉన్న వివేకా పీఏ కృష్ణారెడ్డి

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. తాజాగా ఈరోజు సీబీఐ అధికారులు పులివెందులకు వచ్చారు. కేసులో అనుమానితుడిగా ఉన్న వివేకా పీఏ కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లారు. తన ఇంటికి సీబీఐ అధికారులు వచ్చారని తెలిసిన కృష్ణారెడ్డి ఇంటి లోపలే ఉండి తలుపులు వేసుకున్నారు. దీంతో, ఇంటి బయటే కాసేపు నిరీక్షించిన అధికారులు తలుపులు తీయాలని ఆదేశించారు. కాసేపటి తర్వాత కృష్ణారెడ్డి ఇంటి తలుపులు తీశారు. ఆయనను ఇంట్లోనే సీబీఐ అధికారులు విచారించారు. ఇప్పటికే కృష్ణారెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన బెయిల్ పై ఉన్నారు. కేసు విచారణ ముగింపు దశకు వస్తున్న తరుణంలో ఆయన వద్దకు మరోసారి సీబీఐ అధికారులు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Related posts

మన జెండా పీకేస్తాం అన్నోళ్లు అడ్రస్ లేకుండా పోయారు: నారా లోకేశ్

Ram Narayana

వరల్డ్ రికార్డ్… 4 కి.మీ దూరంలో ఉన్న రష్యా సైనికులను కాల్చి చంపిన ఉక్రెయిన్ స్నైపర్!

Ram Narayana

ప్రకాశం జిల్లాలో ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్ధులు గల్లంతు…

Ram Narayana