ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ప్రస్తావనను రేపటికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

  • సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన చంద్రబాబు
  • పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలన్న సిద్ధార్థ్ లూథ్రా
  • విచారణ తేదీని రేపు ఖరారు చేసే అవకాశం

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. శనివారం నాడు సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో స్పెషల్ లీవ్ పిటిషన్ ను న్యాయవాది గుంటూరు ప్రమోద్ కుమార్ దాఖలు చేశారు. పిటిషన్ ను ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందు మెన్షన్ చేశారు. చంద్రబాబు పిటిషన్ ను అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని ఆయన తరపు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా కోర్టును కోరారు. చంద్రబాబు రిమాండ్ లో ఉన్న నేపథ్యంలో విచారణను అత్యవసరంగా విచారించాలని విన్నవించారు. ఈ క్రమంలో పిటిషన్ ను రేపు ప్రస్తావించడానికి ధర్మాసనం అనుమతించింది. విచారణ తేదీని రేపు ఖరారు చేసే అవకాశం ఉంది.

మరోవైపు చంద్రబాబు ఎన్ని రోజుల నుంచి రిమాండ్ లో ఉన్నారని సిద్ధార్థ్ లూథ్రాను సీజేఐ చంద్రచూడ్ ప్రశ్నించారు. ఈ నెల 8వ తేదీన అరెస్ట్ చేశారని లూథ్రా తెలిపారు. ఏపీలో ప్రతిపక్షాలను అణచివేస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో, రేపు మెన్షన్ లిస్ట్ ద్వారా కోర్టుకు రావాలని లూథ్రాకు సీజేఐ సూచించారు.

Related posts

అవినీతి అంటేనే నాకు నచ్చదు: ధర్మాన ప్రసాదరావు!

Drukpadam

కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు … జైలు వద్ద చెవిరెడ్డి తీవ్ర భావోద్వేగం

Ram Narayana

నన్ను పాకిస్థాన్‌లో పెళ్లి చేసుకోవాలి.. ఐఎస్‌ఐ హ్యాండ్లర్‌తో జ్యోతి మల్హోత్రా చాటింగ్‌..!

Ram Narayana