తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

అసెంబ్లీలో బీఆర్ యస్ సభ్యులపై మంత్రి పొంగులేటి ఫైర్

సభ్య సమాజం సిగ్గు పడేలా బీఆర్ఎస్ సభ్యులు వ్యవహరిస్తున్నారని మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు ..భూ భారతి బిల్లును ఆమోదించకుండా బీఆర్ఎస్ అడ్డుకుంటోందన్న పొంగులేటి బీఆర్ యస్ చర్యలను తూర్పారపట్టారు …ధరణి పోర్టల్ తప్పుల తడక అనే విషయం కేసీఆర్ కు తెలుసని ఆయన సభకు వచ్చి తన అభిప్రాయాలూ వెల్లడించకుండా ఉండటం దారుణమని అన్నారు ..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. భూ భారతి బిల్లుపై ప్రభుత్వం చర్చిస్తుండగా… ఫార్ములా ఈ-రేస్ అంశంపై చర్చకు బీఆర్ఎస్ సభ్యులు పట్టుబడుతున్నారు. స్పీకర్ పోడియంలోకి కూడా బీఆర్ఎస్ సభ్యులు చొచ్చుకుపోయారు. బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన మధ్యే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగించారు.

భూ భారతి బిల్లును ఆమోదించకుండా బీఆర్ఎస్ అడ్డుకుంటోందని పొంగులేటి మండిపడ్డారు. సభ్య సమాజం సిగ్గుపడేలా ఆ పార్టీ సభ్యులు వ్యవహరిస్తున్నారని అన్నారు. ధరణి పోర్టల్ తప్పులతడక అనే విషయం కేసీఆర్ కు కూడా తెలుసని చెప్పారు. కేసీఆర్ 80 వేల పుస్తకాలు చదివారని… పుస్తకాలను క్షుణ్ణంగా చదివి ధరణి పోర్టల్ ను రూపొందించి ఉంటారని తాము భావించామని అన్నారు. మూడేళ్లకే ధరణి పోర్టల్ కు వందేళ్లు నిండాయని చెప్పారు.

భూ భారతి బిల్లును సభలో ప్రవేశ పెట్టినప్పుడు కేసీఆర్ కూడా సూచనలు చేస్తారని భావించామని… కానీ, కేసీఆర్ అసెంబ్లీకి రాలేదని పొంగులేటి విమర్శించారు. సభలో బీఆర్ఎస్ నేతల చిల్లర వేషాలను ప్రజలు హర్షించరని చెప్పారు.

ఎంతో ప్రధానమైన భూ భారతి చట్టం చర్చ జరుగుతుండగా బీఆర్ యస్ సభ్యులు సభలో గొడవ చేయడం ఇతర సభ్యులను మాట్లాడకుండా గొంతు నొక్కడమేనని సిపిఐ నేత కూనంనేని సాంబశివరావు అన్నారు …ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే వచ్చే నష్టమేమిటని అయినా నిరసన తెలపాలంటే గాంధీ విగ్రహం దగ్గర కూర్చొని నిరసన తెలిపితే ఎవరికీ అభ్యంతరంలేదని కానీ ఇదెక్కడి న్యాయం మమ్ములను మాట్లాడకుండా చేయడమని అన్నారు ..స్పీకర్ ఓపికకు సహనంలా ఉందని మీరు చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు ..ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసి మాట్లాడుతూ బీఆర్ యస్ చర్యలను తప్పుపట్టారు …10 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు సభ జరగకుండా అడ్డుకోవడంపై మండిపడ్డారు ..

Related posts

అల్లు అర్జున్ పై రేవంత్ రెడ్డి ఫైర్.. సంధ్య థియేటర్ ఘటనకు ఆయనే కారణం …

Ram Narayana

ఆరు నెలల తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టిన కేసీఆర్!

Ram Narayana

మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి.. అసెంబ్లీలో రేవంత్ సర్కార్ తీర్మానం…

Ram Narayana