సినిమా వార్తలు

స్మగ్లింగ్‌ను గౌరవంగా చూపించే సినిమాకు రాయితీనా?: సీపీఐ నారాయణ

  • ‘పుష్ప- 2’ విషయంలో ప్రభుత్వమే తొలి ముద్దాయన్న నారాయణ
  • అల్లు తరం వారు ఇలాంటి సినిమాలను ప్రోత్సహించడమేంటని ప్రశ్న
  • బాధిత కుటుంబానికి త్వరలోనే సాయం చేస్తామన్న నారాయణ
  • తొక్కిసలాట ఘటనపై సమాజం సిగ్గుతో తలదించుకోవాలన్న సీపీఐ నేత

అల్లు అర్జున్ నటించిన పుష్ప- 2 సినిమా విషయంలో ప్రభుత్వమే తొలి ముద్దాయి అని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. స్మగ్లింగ్‌ను గౌరవంగా చూపించిన సినిమాకు రాయితీ ఇవ్వడమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదర్శ నటులైన అల్లు తరం వారు ఇలాంటి సినిమాలను ప్రోత్సహించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓ మహిళ తన కుమారుడి ప్రాణాలు కాపాడుకునేందుకు తన ప్రాణాలను బలిపెట్టిందని, సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకుని ఈ ఘటనను తీవ్రంగా ఖండించాలని పేర్కొన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత కళాకారులు, సాహితీవేత్తలదేనని అన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరిన నారాయణ.. ఆ కుటుంబానికి తమవంతు సాయం అందిస్తామని ప్రకటించారు.

Related posts

ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెర .. హైదరాబాద్‌లో రెహమాన్ మ్యూజిక్ ఫీస్ట్!

Ram Narayana

చిరంజీవిని కలిసిన శేఖర్ కమ్ముల.. ఆసక్తికర పోస్ట్!

Ram Narayana

‘విశ్వంభర’లో కనీవినీ ఎరుగని విజువల్ ఎఫెక్ట్స్ .. హాలీవుడ్‌ను తలదన్నేలా మెగా మూవీ!

Ram Narayana