తెలంగాణ వార్తలు

ఫిబ్రవరి మూడవ వారంలో కొత్తగూడెంలో టీయూడబ్ల్యూజే భద్రాద్రి జిల్లా మహాసభ !

2025 ఫిబ్రవరి మూడవ వారంలో టీయూడబ్ల్యుజే (ఐజేయూ)భద్రాద్రికొత్తగూడెం జిల్లా మహాసభను జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో నిర్వహించాలని ఆదివారం కొత్తగూడెంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశం ఏకాగ్రవంగా తీర్మానించింది . ఈ మేరకు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాంనారాయణ ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆదివారం పలు తీర్మానాలు చేశారు. జనవరి 20 నుంచి 30వ తేదీ వరకు అన్ని మండలాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తిచేయాలని, మహాసభల నిర్వహణకు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఇమంది ఉదయ్ కుమార్, మొబగాపు ఆనంద్కుమార్లతో పాటు జాతీయ కౌన్సిల్ సభ్యులు దుద్దుకూరి రామారావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జునమాల రమేష్, బి.వి.రమణారెడ్డి, కోడూరి సత్యనారాయణతో కూడిన మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ తీర్మానం చేశారు.

జర్నలిస్టుల ఇళ్లస్థలాల విషయంలో సుప్రీం కోర్ట్ తీర్పుఅసంబద్ధం …

ఈ సందర్భంగా టీయుడబ్ల్యుజే (ఐజేయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ మాట్లాడుతూ…జర్నలిస్టుల ఇళ్లస్థలాల విషయంలో సుప్రీం కోర్ట్ తీర్పుఅసంబద్ధంగా ఉందని తప్పు పట్టారు …ఇది మొత్తం దేశంలోని జర్నలిస్టులకు తీరని అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు … సమాజహితం కోసం నిరంతరం పనిచేస్తూ అవినీతి అక్రమాలను వెలికి తీస్తూ వాచ్ డాగ్ లాగా పనిసేస్తున్న జర్నలిస్టలను న్యాయ, కార్యనిర్వాహక ఒకే గాటకట్టడం సరికాదని అన్నారు … హైదరాబాదులో జర్నలిస్టుల సొసైటీలకు ఇచ్చిన ఇండ్ల స్థలాలను సుప్రీంకోర్టు తప్పుబట్టి రద్దు చేయడాన్ని తమ యూనియన్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. దీనిపై ఇప్పటికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి , రెవెన్యూ మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు … వారు కూడా న్యాయసలహా కోరుతున్నారని పేర్కొన్నారు .. టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో లీగల్గా ఫైట్ చేయనున్నట్లు తెలిపారు.

జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపడుతుందని వెల్లడించారు. ఇండ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు కోసం ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు వివరించారు. చెన్నై, పాండిచ్చేరీ, చండీఘర్,డెహ్రూడూన్, పాట్నాలో జరిగిన ఐజేయూ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో మీడియా కమిషన్, వేజ్ బోర్డు వంటి అంశాలపై చర్చ జరిగినట్లు చెప్పారు. ప్రతీ ఒక్కరూ ఉత్తమ జర్నలిస్టులుగా పనిచేయాలనేది యూనియన్ ఉద్దేశమని , పౌరసమాజాన్ని కూడగట్టుకుని పేదల అభ్యున్నతికి వార్తలు రాయాలని ఆయన సూచించారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో యూనియన్ బలోపేతం కోసం మండల స్థాయి నుంచి సంఘ నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు కనుకు వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీ సత్యానంద్, గిరి ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏర్పుల సుధాకర్ రావు, పెండ్యాల భాస్కరరావు , చంద్రశేఖర్, జానీ, చారు గుండ్ల రమేష్ ,కోటిరెడ్డి కార్యవర్గ సభ్యులు, జిల్లాలోని పలువురు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు…

జిల్లా అధ్యక్షుడు ఉదయ్ ని పరామర్శించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణ…

ఇటీవల మరణించిన ఇమంది కళ్యాణ్ కృష్ణ కుటుంబ సభ్యులను టి యు డబ్ల్యు జే ఐ జే యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణ పరామర్శించారు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టియూడబ్ల్యూజే ఐజేయు అధ్యక్షుడు ఇమంది ఉదయ్ కుమార్ కు కళ్యాణ్ కృష్ణ సోదరుడు. 26వ తేదీ ఉదయం హఠాత్తుగా గుండెపోటు రావడంతో హైదరాబాదు వారాసిగూడలో కళ్యాణ్ కృష్ణ మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన భౌతికకాయాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంనకు తీసుకువచ్చి కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామనారాయణ కళ్యాణ్ కృష్ణ సోదరులు ఉదయ్ కుమార్ మరియు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అన్నివేళలా యూనియన్ అండగా ఉంటుందని అధైర్యపడవద్దని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జనుమాల రమేష్, బివి రమణారెడ్డి, ముబగాపు ఆనంద్, సత్యనారాయణ, శ్రీనివాసరావు, ఏర్పుల సుధాకర్, జానీ, కోలా కుమార్, మురళి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

హరీశ్‌రావు విచారణపై పోలీసుల క్లారిటీ.. ఆ ప్రచారాన్ని నమ్మవద్దన్న సిట్

Ram Narayana

వరుసగా మూడోసారి గవర్నర్ తేనీటి విందుకు కేసీఆర్ దూరం.. కానరాని కాంగ్రెస్, బీజేపీ కీలక నేతలు

Ram Narayana

నల్లమల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక … సీఎం రేవంత్ రెడ్డి

Ram Narayana